పెళ్లి అంటే ఎంత హడావిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బంధుమిత్రులు అందరూ పెళ్లి మండపానికి చేరుకుని నూతన వధూవరులకు ఆశీర్వచనాలు ఇవ్వడానికి వస్తూ ఉంటారు.  ఇక కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో హడావిడి గా అన్ని పనులు చూసుకుంటూ ఉంటారు. ఇక్కడ మండపంలో పెళ్లి జరుగుతుండగా ఇలాంటి సందడి నెలకొంది. కానీ అంతలో ఊహించని విషాదం తలుపు తట్టింది. ఇక ఓవైపు వరుడు వధువు పెల్లు చేసుకుంటుండగా. అందరూ ఎంతో సంతోషంగా ఆ పెళ్లిని వీక్షిస్తున్నారు. కానీ అంతలో వరుడి అన్న కు గుండెపోటు వచ్చింది. వెంటనే అప్రమత్తమై అటు ఆస్పత్రికి తరలించినప్పటికీ చివరికి అప్పటికే చేయి దాటిపోయింది. వరుడి అన్న కాస్త గుండెపోటుతో మరణించడంతో పెళ్లి ఇంట విషాదం నెలకొంది. ఈ ఘటన అనంతపురం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..  పుట్టపర్తి పంచాయితీ జనముల పల్లికి చెందిన కిరణ్ టాక్సీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అయితే ఇటీవలే కిరణ్ తమ్ముడు ప్రశాంత్ కు ధర్మవరానికి చెందిన యువతితో వివాహం కుదిరింది. ఈ క్రమంలోనే ఇటీవల బంధు మిత్రులు పెద్దలు అందరి సమక్షంలో దేవంగా కళ్యాణ మండపంలో పెళ్లి జరుగుతుంది. ఇక పెళ్లి మండపం లో అంతా సందడి వాతావరణం నెలకొంది. కానీ ఉన్నట్లుండి ఊహించని ఘటన చోటుచేసుకుంది. ప్రశాంత్ అన్న కిరణ్ కు ఉన్నట్టుండి గుండె నొప్పి వచ్చింది. కొద్దిసేపు పక్కన కూర్చోబెట్టి వివాహమైన తర్వాత బంధువులు ఆసుపత్రికి తరలించారు. అయితే అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు  ఇక టాక్సీ డ్రైవర్ గా పనిచేస్తున్న కిరణ్ కరోనా వైరస్ ఆర్థిక సమస్యలతో తరచూ బాధ పడుతూ ఉండేవాడు అని బంధువులు తెలిపారు  అందుకే టెన్షన్ కారణంగా గుండెపోటు వచ్చి ఉంటుందని చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: