భార్య భర్తల బంధం అంటే అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ గా ఉండాలి ఒకసారి మూడుముళ్ల బంధంతో ఒక్కటైన తర్వాత ఎన్ని కష్టాలు నష్టాలు  వచ్చినా ఒకరికి ఒకరు తోడునీడగా ఉండాలి కడవరకు కట్టుకున్న వారిని అంటిపెట్టుకుని ఉండాలి. కానీ నేటి రోజుల్లో మాత్రం చిన్నచిన్న కారణాలకే ఏకంగా కట్టుకున్న వారిని ప్రాణాలు తీసేందుకు   సిద్ధమవుతున్నారు చాలామంది.  మూడు ముళ్ల బంధానికి అసలు విలువ ఇవ్వడం లేదు  ఇక ఇటీవల కాలంలో ఏకంగా కట్టుకున్న వారిని హత్య చేసేందుకు ఎన్నో ప్లాన్లు వేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఇలాంటి ఘటనలు చూస్తుంటే అసలు మనుషుల్లో మానవత్వం ఇంకా బ్రతికి ఉందా అని అనుమానం కలుగుతుంది. అలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి నేటి రోజుల్లో . సాధారణంగా భార్య భర్తల మధ్య గొడవలు వచ్చి ఒక వేళ విడిపోవాలని భావిస్తే చట్ట ప్రకారం విడాకులు తీసుకొని విడిపోవచ్చు. కానీ నేటి రోజుల్లో ఎవరూ అలా చేయడం లేదు..  విడాకులు తీసుకోవడం మానేసి ఇక కట్టుకున్న వారితో ఉండడం ఇష్టం లేక ఏకంగా ప్రాణాలు తీసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రాణాలు తీస్తే శిక్షలు పడతాయన్న భయం కూడా కనిపించడం లేదు.  అయితే గతంలో కేరళలో ఇలాంటి తరహా ఘటనలు వెలుగులోకి వచ్చిన సంచలన గా మారిపోయాయ్ అన్న విషయం తెలిసిందే. ఏకంగా కసాయి భర్త భార్యను రెండుసార్లు పాము తో కరిపించి మరి చంపాడు.


 ఈ ఘటన అప్పట్లో సంచలనం గా మారిపోయింది. 2020 లాక్ డౌన్ సమయంలో కేరళకు చెందిన నిందితుడు సురేష్ భార్య పైకి నాగుపామును ఉసిగొల్పాడు. ఏకంగా రెండుసార్లు కాటు వేయించాడు. ఆ తర్వాత భార్య మరణానికి తనకు ఎలాంటి సంబంధం లేదు అంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు.  కానీ పోలీసులు కేసు నమోదు చేసుకొని తమదైన శైలిలో విచారించడంతో అసలు నిజాలు బయటపడ్డాయి. తానే పాముతో భార్యను కాటు వేయించి చంపాను  అన్న విషయాన్ని ఒప్పుకున్నాడు. అయితే ఈ కేసుకు సంబంధించి విచారణ కోర్టులో జరుగుతూ రాగా ఇటీవలే ఇక నిందితుడికి రెండుసార్లు జీవితఖైదు విధించింది కోర్టు.

మరింత సమాచారం తెలుసుకోండి: