ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ పోలీసులు ఎంత మొత్తుకుంటున్నా పెడచెవిన పెట్టే వారే తప్ప పాటించే నాధుడే లేక పోయాడు. వెరసి ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఎలాంటి లైసెన్స్ లేకపోయినప్పటికీ ఎంతోమంది వాహనాలతో రోడ్ల మీదికి వస్తున్నారు. చివరికి అతి వేగం కారణంగా ఇతరుల ప్రాణాలు పోవడానికి కారణం అవుతున్నారు. ఇక ఇటీవల కాలంలో అతి వేగం కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాద ఘటన రోజురోజుకు పెరిగిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఈ రోడ్డు ప్రమాదాలు ఎంతోమందిని జీవచ్ఛవాలుగా మారుస్తున్న ఘటనలు కూడా ఎక్కువైపోయాయి.


 అదే సమయంలో ఒకరి అతివేగం అభం శుభం తెలియని అమాయకుల ప్రాణాలు పోవడానికి కూడా కారణమవుతుంది. ఇలా ప్రతి ఏడాది కేవలం రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య అంతకంతకూ పెరిగి పోతూనే ఉంది. ఇక ఇటీవలే ఇలాంటి ఒక రోడ్డు ప్రమాదం  ఘటన జరిగింది. ఇప్పుడు జరిగిన ఘటన చూసిన తర్వాత ఎవరైనా ఇంత దారుణంగా డ్రైవింగ్ చేస్తారా అని అనిపిస్తూ ఉంటుంది. స్పీడుగా వెళ్తుంటే ఎంతో థ్రిల్ వుంటుంది అని అనుకున్నాడు సదరు వ్యక్తి. కానీ వేగంగా వెళుతున్న కారును మాత్రం కంట్రోల్ చేయలేకపోయాడు.. దీంతో తప్పిన కారు విద్యుత్ స్తంభం పైభాగాన తాకింది.


 అంతేకాదు రోడ్డును ఆనుకొని ఉన్న ఒక రక్షణ గోడను కూడా ఢీకొట్టి గోడ పైకి ఎక్కేసింది ఆ కారు. విద్యుత్ స్తంభానికి  గోడకి మధ్య ఇరుక్కుపోయింది. ఈ ఘటన విశాఖ జిల్లా వెంకటాపురం - రాంబిల్లి రోడ్డులో జరిగినట్లు తెలుస్తోంది. తెల్లవారు జామున ఈ ప్రమాదం జరగా డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడం వల్లనే కారు అదుపుతప్పి నట్లు తెలుస్తోంది.. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదంలో ఆవు మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతుండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: