ఒకప్పటి అనాగరిక సమయంలోనే కాదు నేటి నాగరిక సమాజంలో కూడా మహిళల జీవితం ప్రశ్నార్థకంగా మారిపోతోంది. అప్పుడు ఇప్పుడు మగాడి చేతిలో ఆడపిల్ల కీలుబొమ్మ లేనా అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. ఎందుకంటే ఎంతోమంది మహిళలు మహిళా సాధికారత వైపు అడుగులు వేస్తున్న సమయంలో మరో వైపు మహిళలు తీవ్ర స్థాయిలో వివక్షకు గురవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకవైపు మహిళలు కనిపిస్తే చాలు దారుణంగా లైంగిక దాడులకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో మహిళగా పుట్టడమే మేము చేసిన పాపమా అని ప్రతి మహిళ బాధ పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.


 పరాయి వాళ్ల నుంచి మాత్రమే కాదు సొంత వారి నుంచి కూడా లైంగిక వేధింపులు ఎదురవుతూ ఉండటంతో  బాధను ఎవరితో చెప్పుకోవాలో తెలియక ప్రతి ఆడపిల్ల లోలోపల కుమిలిపోతున్న దుస్థితి ఏర్పడుతుంది.ఇటీవలే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలికల దినోత్సవం రోజే ఈ ఘటన జరగడం మరింత దారుణమనే  చెప్పాలి. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డనే మరో వ్యక్తి చేతుల్లో పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇలా కూతురుని వేరే వ్యక్తికి అమ్మేసేందుకు ఒక కుటుంబం సిద్ధం కావడం సంచలనంగా మారిపోయింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది. ముంబైకి చెందిన ఒక వ్యక్తికి తమ పద్నాలుగేళ్ళ కూతురిని అమ్మాలని చూసింది ఇక్కడ ఒక కుటుంబం.. కన్న కూతుర్ని అమ్మేందుకు ఐదు లక్షలకు బేరం పెట్టుకున్నారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే బాలికను రక్షించిన నిందితులను అరెస్టు చేశారు పోలీసులు . స్థానికంగా ఈ ఘటన హాట్ టాపిక్ గా మారిపోతుంది. ఇటీవల కాలంలో ఎంతో మంది తల్లిదండ్రులు ఆడపిల్ల పుట్టిందని సంతోషపడుతుంటే.. ఇలా కొంతమంది మాత్రం ఆడ పిల్లల జీవితాలతో చెలగాటం ఆడటం సభ్యసమాజం తలదించుకునేలా చేస్తుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: