నేడు ముంబై డ్రగ్ డాన్ టోనీ రెండో రోజు కస్టడీ విచారణ జరుగనుంది.  హైదరాబాద్ లో వ్యాపారులకు పెద్ద మొత్తంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న టోనీ..  ఇంటర్నేషనల్డ్రగ్స్ స్మగ్లర్ఆఫ్రికన్ 'స్టార్బాయ్' వివరాలపై  విచారణ చేస్తున్నారు.  తొలి రోజు విచారణలో కీలక వివరాలు రాబట్టిన పంజాగుట్ట పోలీసులు...  సీపీ సీవీ ఆనంద్‌ నేతృత్వంలో‌ విచారిస్తుంది స్పెషల్‌ టీమ్‌.   ముంబై, గోవాలో షెల్టర్స్‌ గురించి ఆరా తీస్తున్నారు పోలీసులు.   ఆఫ్రికన్‌ డ్రగ్ స్మగ్లర్‌ 'స్టార్‌బాయ్‌'ను పట్టుకోవడమే టార్గెట్‌గా ఇంటరాగేషన్ చేస్తున్నారు.   ఆఫ్రికా నుంచి ముంబై షిప్యార్డుకు వస్తున్న కొకైన్ దిగుమతిపై వివరాలు సేకరిస్తున్న పోలీసులు..  ముంబై, గోవా ఏజెంట్స్‌తో హైదరాబాద్‌ కస్టమర్ల లింక్స్‌ తెలుసుకుంటున్నారు. 
 
 బిజినెస్మెన్, వీఐపీలతో టోనీకి పరిచయాలు ఉన్నాయి.   టోనీ వద్ద పని చేస్తున్న ఇమ్రాన్‌ బాబు షేక్, నూర్ మహ్మద్‌లతో డ్రగ్స్ సరఫరా పై కూపీ లాగుతున్నారు పోలీ సులు.  హిమాయత్‌నగర్‌కు చెందిన కాంట్రాక్టర్ నిరం జన్ కుమార్ జైన్‌ ముప్పై సార్లు కొకైన్ ఆర్డర్  గుర్తించారు పోలీసులు. టోనీ వద్ద 60 మందికి పైగా  రిపీటెడ్‌ కస్డమర్లు... పరారీలో ఉన్న వ్యాపారవేత్తల కోసం పోలీసుల ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.  పోలీసుల ప్రశ్నలకు సమాదానాలు దాటవేస్తున్న టోనీ.. మౌనమే సమాదానం గా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.  ఫోన్ కాల్ సిడిఆర్ ముందుంచి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు పోలీసులు.  టోనీ యూస్ చేసిన డ్రగ్స్ బిజినెస్ కోడ్ ఎంటి ?  వ్యాపారులతో ఎలా పరిచయాలు పెంచుకున్నాడు. ఎలా డ్రగ్స్ డిలింగ్ చేశాడు.? డ్రగ్స్ బిజినెస్ లో కోట్ల రూపాయలు ఎక్కడ దాచాడు..  డ్రగ్స్ పార్టీలు ఎక్కడ ఎక్కడ ఆరెంజ్ చేసాడు? ఎఫ్ఎస్సెల్ కు టోనీ ఫోన్.. డిలీట్ డాటా వెలికితీసే పనిలో ఉన్నారు పోలీసులు.  ఈ కేసులో వివరాలు అతి తర్వలోనే తెలిసే అవకాశాలు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: