
ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఆ రైతు పొలంలో ఎలుకల బెడద చాలా ఎక్కువైపోయింది. ఎలకల కారణంగా పంట నష్టం కూడా వాటిల్లుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో ఇక ఎలకల మందు పెట్టాలి అని నిర్ణయించుకున్నాడు. కానీ ఇక ఎలకల కోసం పెట్టిన మందు కాస్త నెమల్లు తిని చివరికి మృతి చెందాయి. ఇక ఈ ఘటనలో ఏకంగా 12 నెమళ్లు మృతి చెందడం సంచలనంగా మారిపోయింది. తమిళనాడులో ఈ విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది.
తమిళనాడులోని తిరుపత్తూరు సమీపంలో ఉన్న కురన్ పత్తి గ్రామానికి చెందిన షణ్ముగం అనే రైతు తన పొలంలో వరి పంట వేశాడు. ఇటీవల కాలంలో వరి పొలంలో ఎలుకల బెడద ఎక్కువైపోయింది. ఈ క్రమంలోనే ఎలుకలను చంపడానికి ఎలకల మందు పెట్టాడు. కానీ అదే సమయంలో పొలంలోకి వచ్చిన నెమళ్లు ఆ రైతు పెట్టిన ఎలకల మందు తినేసాయి. దీంతో అక్కడికక్కడే మృతి చెందాయి. ఒకేసారి 12 నెమళ్లు మృతి చెందడం సంచలనంగా మారిపోయింది. పోలీసులకు సమాచారం వెళ్ళింది. ఇక అనంతరం సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక రైతు షణ్ముగాం ను అరెస్టు చేసి విచారణ మొదలు పెట్టారు పోలీసులు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది..