ప్రేమ అనేది ఒక మధురమైన జ్ఞాపకం.. రెండు మనసుల మధ్య ఎప్పుడు ఏ క్షణంలో ప్రేమ పుడుతుంది అనేది కూడా ఊహకందని విధంగానే ఉంటుంది. కానీ నేటి రోజుల్లో మనుషుల మధ్య పూడుతున్న  ప్రేమ కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే వావివరుసలు మరిచిపోయి.. మానవ బంధాల కు  విలువ ఇవ్వకుండా ఇక ఎంతో మంది ప్రేమ అనే పేరు చెప్పీ జల్సా చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి ఒక వింత ఉదంతం వెలుగులోకి వచ్చింది.యూపీలోని గొండ లో నలుగురు పిల్లల తల్లి, 17 ఏళ్ల యువకుడు  మధ్య ప్రేమ చిగురించింది. చివరికి ఈ ప్రేమ ప్రాణాలు పోవడానికి కారణం అయింది. ఇద్దరు కూడా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.


 ఈ ఘటన  స్థానికంగా సంచలనం గా మారిపోయింది.  గ్రామంలో ఓ మహిళా, యువకుడు వేరు వేరు చోట్ల ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే నలుగురు పిల్లలు ఉన్న ఓ మహిళ 17 ఏళ్ల యువకుడు తో ప్రేమ వ్యవహారం కొనసాగించడం మొదలు పెట్టింది. ఈ విషయం ఊరంతా పాకిపోయింది. దీంతో ఆ మహిళను అవమానించడం  మొదలు పెట్టారు గ్రామస్తులు. దీంతో మనస్తాపం చెందిన సదరు మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇక ఈ విషయం తెలిసిన 17 ఏళ్ల బాలుడు కూడా మరో ప్రాంతంలో ఉరివేసుకున్నాడు.


 అయితే సదరు మహిళ భర్త ఉపాధి నిమిత్తం బయట ప్రాంతాలకు వెళ్ళేవాడు. ఈ క్రమంలోనే ఒంటరితనాన్ని భరించలేక సదరు మహిళ 17 ఏళ్ల యువకుడు తో ప్రేమ వ్యవహారం కొనసాగినట్లు తెలుస్తోంది. మృతురాలికి ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి ఉన్నారు. కాగా ఇక మృతుడు పింటూ కశ్యప్ 9వ తరగతి చదువుతున్నాడు. ఇద్దరూ ఒకే వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: