తండ్రి అంటే పిల్లలకు ఎప్పుడు భరోసా ఇవ్వాలి. ఏ కష్టం వచ్చినా నేనున్నాను అనే ధైర్యం ఇవ్వాలి. అంతేకాకుండా పిల్లలకు ఏ చిన్న కష్టం రాకుండా ఎంతో అల్లారుముద్దుగా చూసుకోవాలి. సాధారణంగా తండ్రి అంటే ఇక పిల్లల కోసం జీవితాన్ని త్యాగం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అందుకే అమ్మ కడుపులో 9 నెలలు పెరిగిన ఆ జీవితానికి అసలు రూపాన్ని ఇచ్చేది మాత్రం తండ్రి మాత్రమే అని.. అందుకే కనిపించని దేవుడు తండ్రి అని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక తండ్రి మాత్రం ఏకంగా సొంత పిల్లల విషయంలో నీచాతి నీచంగా ప్రవర్తించాడు.


 తాంత్రికుడు చెప్పిన మాటలు విని ఏకంగా సొంత కూతుర్ల పైన అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కొడుకు పుట్టాలని తండ్రి సమాజం సిగ్గుపడేలా చేశాడు. ఈ ఘటన బీహార్లో వెలుగులోకి వచ్చింది. బక్సర్ జిల్లా రాజ్ పూర్ మండలంలో ఏకంగా సొంత బిడ్డలకే విటమిన్ టాబ్లెట్స్ పేరుతో మత్తు మందు ఇచ్చి తన స్నేహితుడైన తాంత్రికుడు తో  తండ్రి కలిసి అత్యాచారం చేశాడు. అయితే దీనిని గుర్తించిన కూతుర్లు చివరికి ఏకంగా తండ్రిని ఎదిరించారు. దీంతో బాలికను దారుణంగా కొట్టడం వేధించడం మొదలు పెట్టాడు ఆ కసాయి తండ్రి. దీంతో తండ్రి వేధింపులు తట్టుకోలేక పోయిన ఇద్దరు బాలికలు చివరికి ఇంట్లో నుంచి పారిపోయారు. కాగా కేంద్రంలో ఓ గదిలో అద్దెకు ఉండే వారు తండ్రి తాంత్రికుడు చేసిన నీచమైన  పనులు అన్నింటినీ కూడా ఎలాగైనా బయటపెట్టాలని  రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని భావించి ఒక లేఖ కూడా రాశారు. లేఖలో జరిగిన విషయాలన్నింటినీ కూడా వెల్లడించి తమను కాపాడి తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన తండ్రి తాంత్రికుడు కి  బుద్ధి చెప్పాలని కోరారు. ఈ క్రమంలోనే బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తండ్రి తాంత్రికుడుతో పాటు మరో ఐదుగురిని కూడా అరెస్టు చేశారు. ఈ ఘటన కాస్త రాష్ట్రవ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి: