ఇటీవలి కాలంలో మానవత్వం ఉన్న మనుషుల కంటే ఉన్మాదులు గా మారిపోతున్న మనుషులు ఎక్కువగా కనిపిస్తున్నారు. చిన్నచిన్న కారణాలకే ఏకంగా సొంత వారి ప్రాణాలు కూడా తీసేందుకు ఎక్కడ వెనకాడటం లేదు. వెరసి రోజురోజుకు వెలుగులోకి వస్తున్న ఘటనలు సభ్యసమాజాన్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఒకప్పుడు ఏదైనా సమస్య వస్తే సొంత వారు ఉన్నారు అని ధీమా ఉండేది. కానీ ఇప్పుడు సొంత వారే ప్రాణాలు తీస్తున్న నేపథ్యంలో ఎప్పుడు ఎవరి నుంచి ప్రాణహాని ఉందో అని అనుక్షణం భయపడుతూ బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.


 ఇకపోతే ఇటీవల ఇక్కడ ఇలాంటి దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన కొడుకే చివరికి తండ్రిని దారుణంగా హతమార్చాడు. పాశవికమైన ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో వెలుగులోకి వచ్చింది. తండ్రి గొంతు కోసిన కొడుకు చివరికి గోనె సంచిలో పెట్టి మృతదేహాన్ని పారవేసేందుకు వెళుతుండగా పోలీసులు చెక్ చేసిన సమయంలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఫనగర్ లో నివసించే రామ్ లాల్  వాహన ఫ్యాక్టరీలో పని చేస్తూ ఉండేవాడు.  మద్యానికి బానిస గా మారిపోయారు. ఈ క్రమంలోనే పని చేయగా వచ్చిన ఆదాయాన్ని కుటుంబానికి బదులు మద్యానికి ఖర్చు చేస్తూ ఉన్నాడు. మద్యం తాగి వచ్చి భార్య పిల్లలను దుర్భాషలాడుతూ గొడవపడటం చేస్తూ ఉండేవాడు.


 ఇలా ఎన్నో రోజుల నుంచి రాంలాల్ ఆకృత్యాలను భరిస్తూ వచ్చింది కుటుంబం. ఇప్పుడు పిల్లలు పెద్దయ్యాక కూడా తీరులో మార్పు రాలేదు. ఈ క్రమంలోనే ఇటీవల మరోసారి రాత్రి సమయంలో రాంలాల్ మద్యం సేవించి వచ్చి ఇంట్లో ఉన్న భార్య పిల్లలను దారుణంగా తిట్టడం  మొదలుపెట్టాడు. దీంతో 24 ఏళ్ళ కొడుకు అమన్ అన్ని వింటూ నిద్రలోకి జారుకున్నాడు. ఆ తరువాత తెల్లవారుజామున మూడు గంటల సమయంలో లేచి గొంతుకోసి హత్య చేశాడు. మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి పార వేసేందుకు  ప్రయత్నించగా పోలీసులు చెక్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. చివరికి నిందితున్ని అరెస్టు చేశారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: