
ఇలాంటివి సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా జరుగుతాయి అన్నది కొన్ని ఘటనలు నిరూపిస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇటీవలి కాలంలో ఇక పెళ్లి చూపుల కోసం ఫోటో పంపించాలి అంటే ఒక ఫోటోకి ఫోటో షాప్ లో ఎడిట్ చేసి ఎంతో అందంగా మార్చి పంపించడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ నేరుగా వెళ్లి చూసిన తర్వాత ఫోటోలో ఉన్నది కళ్ళ ముందు ఉన్న ఓ వ్యక్తి ఒక్కరేనా అని ఆశ్చర్య పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ ఓ యువతికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. తల్లిదండ్రులు వచ్చి ఒక అబ్బాయి ఫోటో పెట్టగానే ఆ అబ్బాయిని చూసి ఎంత అందంగా ఉన్నాడో అంటూ మురిసి పోయింది యువతి.
కానీ తీరా పెళ్లి సమయానికి అతను ఫోటోలో కంటే నల్లగా ఉండటంతో ఒక్కసారిగా షాక్ అయింది. దీంతో నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అంటూ అందరికీ షాక్ ఇచ్చింది సదరు యువతి. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని ఏటావా జిల్లాలో వెలుగులోకి వచ్చింది. సరిగ్గా పెళ్లి సమయానికి తన పక్కన ఉన్నది ఫోటోలో చూపించిన వాడు కాదని వధువు సహా ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ క్రమంలోనే పెళ్లి సమయంలో వరుడికి ఇచ్చిన నగలు గిఫ్టులు అన్ని తిరిగి ఇచ్చేయాలని పోలీసులను ఆశ్రయించారు వధువు కుటుంబ సభ్యులు. ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.