ప్రేమ గుడ్డిది అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఒక్కసారి ఇద్దరి మనసులు కలిసిన తర్వాత ఇక వారిని విడదీయడం ఎవరితరమూ కాదు.  భౌతికంగా వారిని దూరంగా ఉంచినప్పటికీ  మానసికంగా మాత్రం వారు ఎప్పటికీ విడిపో లేరు అన్నది ఎంతో మంది ప్రేమికులను  చూస్తే అర్థమవుతుంది. ఇటీవలి కాలంలో ప్రేమ అనేది మోసానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. అవసరాలు తీర్చుకోవడానికి ప్రేమ అనే ముసుగు వేసుకుని చివరికి మోసాలకు పాల్పడుతున్న వారు నేటి రోజుల్లో ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు.


 వెరసి రోజురోజుకు ప్రేమ అనేది ఒక కమర్షియల్ ఎలిమెంట్ గా కనిపిస్తుంది అనే చెప్పాలి. ఇక ఎంతోమంది ప్రేమ కారణంగా మోసపోతూ ఉండటం చూస్తూ ఉంటే నేటి రోజుల్లో నిజాయితీగా ప్రేమించే వారు లేరా.. ప్రేమించిన వారి కోసం ప్రాణాలను కూడా అర్పించే  వారు అసలు ఎక్కడా కనిపించరా అనే ప్రశ్న కూడా అందరిలో తలెత్తుతూ ఉంటుంది. అయితే ఇంకా ప్రేమ కోసం ప్రాణాలు ఇచ్చే వారు.. ఎలాంటి త్యాగం చేయడానికైనా సిద్ధపడే వారు ఉన్నారు అన్నది ఇక్కడ జరిగిన ఘటన గురించి తెలిస్తే మాత్రం అర్థమవుతోంది.


 కేవలం అవసరాల కోసం మాత్రమే ప్రేమ ముసుగు వేసుకుంటున్న నేటి రోజుల్లో ఏకంగా ప్రేమికుడి కోసం ఎవరూ చేయని త్యాగం చేసింది సదరు యువతి. అసోమ్ - సువల్ కచ్చి గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతికి పక్క గ్రామానికి చెందిన యువకుడుతో ఫేస్బుక్లో పరిచయం అయింది. పరిచయం ప్రేమగా మారింది. ఆ యువకుడికి హెచ్ఐవి ఉంది అన్న విషయం తెలిసినప్పటికీ ఇక పెద్దలను ఎదిరించి ఆ యువకుడితో మూడుసార్లు పారిపోయింది. తల్లిదండ్రులు తీసుకొచ్చిన నచ్చజెప్పారు. ఈ క్రమంలోనే ప్రియుడు నుంచి తనను ఎవరూ వేరు చేయొద్దు అనే భావనతో ఏకంగా సిరంజితో ఆ యువకుడి లో ఉన్న హెచ్ఐవీ రక్తాన్ని తన శరీరం లోకి ఎక్కించుకుంది ఈ విషయం తల్లిదండ్రులకు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: