సాధారణంగా విద్యార్థులు సరిగ్గా చదవకపోతే అటు ఉపాధ్యాయులు మందలించడం లాంటివి అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం అన్న విషయం తెలిసిందే. ఇక ఇలా మందలించడం వెనుక కేవలం విద్యార్థులను సరైన మార్గంలో నడిపించాలి బాగా చదివేలా చేయాలి అనే ఉద్దేశం మాత్రమే ఉంటుంది. అందుకే ఈ విషయం తెలిసినప్పటికీ కూడా అటు తల్లిదండ్రులు కూడా పెద్దగా పట్టించుకోరు. ఆమాత్రం మందలించకపోతే పిల్లలు ఎలా దారిలోకి వస్తారు అని అనుకుంటూ ఉంటారు.  కానీ ఇటీవల కాలంలో మాత్రం కొంతమంది టీచర్లు విద్యార్థుల పట్ల అమానవీయంగా వ్యవహరిస్తూ ఉన్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.


 విద్యార్థులు చేస్తున్న చిన్న చిన్న తప్పులకే దారుణంగా ప్రవర్తిస్తూ ఇష్టం వచ్చినట్లుగా కొడుతున్న ఘటనలు అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇక ఉపాధ్యాయులు కొట్టిన దెబ్బలు తాలలేక  కొంతమంది విద్యార్థులు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. దీంతో పేరెంట్స్ శోకసంద్రంలో మునిగిపోతున్నారు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. పరీక్షలో ఒకే ఒక్క పదం తప్పు రాసిన కారణంగా ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ విషాదకరమైన ఘటన ఉత్తరప్రదేశ్లోని జౌరియా జిల్లాలో వెలుగు చూసింది.


 నికిత్  అనే దళిత బాలుడు స్థానిక పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు.  ఇకపోతే ఇటీవల ఎగ్జామ్ నిర్వహించాడు ఉపాధ్యాయుడు. కాగా ఈ పరీక్షలో ఒక్క పదం తప్పు రాశాడు అనే కారణంతో ఉపాధ్యాయుడు అశ్విన్ సింగ్ కర్రలు రాడ్ తో దారుణంగా నిఖిత్ ను చితకబాదాడు. దీంతో దెబ్బలకు తాళలేకపోయిన విద్యార్థి స్పృహ తప్పి పడిపోయాడు. అయితే  జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా విద్యార్థి మృతి చెందినట్లు తెలుస్తుంది. అయితే సదరు దళిత బాలుడిని కులం పేరుతో దూషిస్తూ ఉపాధ్యాయుడు కొట్టినట్లు మిగతా విద్యార్థులు తెలిపారు. బాలుడు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: