ఇటీవల కాలంలో వావి వరసలకు కాస్తైన విలువ ఇవ్వని మనుషులు క్షణకాల సుఖం కోసం నీచాతి నీచమైన పనులు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే మానవ బంధాలకు విలువ ఇవ్వకుండా అక్రమ సంబంధాలకు తెరలేపుతున్నారు. కట్టుకున్న వారితో సక్రమంగా ఉండకుండా పరాయి వ్యక్తుల మోజులో పడిపోయి చివరికి దారుణాలకు పాల్పడుతున్నారు అని చెప్పాలి. ఇకపోతే నేటి రోజుల్లో అక్రమ సంబంధాల కారణంగా వెలుగులోకి వస్తున్న దారుణ ఘటనలు సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.


 ఇక్కడ అక్రమ సంబంధం కారణంగా మరో దారుణం చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని లక్నోకు చెందిన ధనంజయ్ ఈ ఏడాది ఏప్రిల్ 18వ తేదీన వివాహం జరిగింది. వివాహం తర్వాత భార్యాభర్తలిద్దరూ ఇంట్లోనే వేరు కాపురం పెట్టారు. కాగా ధనుంజయ్ తమ్ముడు శివ బహదూర్ అన్న భార్యతో చనువు  పెంచుకున్నాడు. ఇక అప్పుడప్పుడు తమ్ముడు తన భార్యతో చనువుగా ఉండడాన్ని చూసిన అన్నా పలుమార్లు మందలించాడు. అయితే తమ్ముడు మాత్రం అన్న మాటలను పట్టించుకోలేదు. అన్నయ్య ముందే వదినతో సన్నిహితంగా ఉండడం మొదలుపెట్టాడు.


 దీంతో ఆగ్రహంతో రగిలిపోయాడు అన్న. తన భార్యతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడు అని అనుమానం పెంచుకున్నాడు. రోజు రోజుకి ఈ అనుమానం ఎక్కువ అవుతూ వచ్చింది.  ఈ క్రమంలోనే సొంత తమ్ముడు విషయంలో కూడా దారుణంగా మానవత్వం మరిచి ఆలోచన చేశాడు. చివరికి తన భార్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు అని అనుమానంతో తమ్ముడిని దారుణంగా హత్య చేశాడు. అర్ధరాత్రి సమయంలో నిద్రిస్తుండగా పదునైన ఆయుధంతో దాడి చేసి చంపేసి అక్కడ నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి పట్టుబడ్డ ధనుంజయ్ తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని అనుమానంతో హత్య చేసినట్లు నేరం అంగీకరించాడు.. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: