సాధారణంగా పూజారులు అంటే ఎప్పుడు దైవచింతనలోనే ఉంటారు అన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా సనాతన ధర్మాన్ని అందరికీ తెలియజేస్తూ ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలుస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక పూజారి మాత్రం అందరిలా ఉండలేదు. ఏకంగా దేవుడికి పూజ చేస్తూ ఎంతో నిష్టగా ఉండాల్సింది పోయి.. పగలు పూజ చేస్తూ రాత్రి నేరాలకు పాల్పడటం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే రాత్రిళ్ళు దొంగగా అవతారం ఎత్తి ఏకంగా ఇళ్లల్లో చోరీ చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో తరచూ దొంగతనాలు జరుగుతున్నాయని పోలీసులకు కంప్లైంట్ రావడంతో ప్రత్యేకంగా నిఘ పెట్టిన పోలీసులు చివరికి ఆ గజదొంగ ఎవరో కాదు దేవుడి గుడిలో పూజలు చేసే పూజారి అన్న విషయాన్ని గ్రహించి అరెస్టు చేశారు.


 ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని మొహాలీలో వెలుగు చూసింది. పింజోర్ పట్టణవాసి అయిన రవికుమార్ అలియాస్ రవి పూజారి అనే 4 ఏళ్ల వ్యక్తి సూరజ్పూర్ ప్రాంతంలోని ఒక ఆలయంలో పూజారిగా ఉన్నాడు. అయితే అతను పగలు పూజలు చేస్తూనే ఇక రాత్రి కాగానే దొంగగా మారి చోరీలకు పాల్పడుతూ ఉన్నాడు. ఇప్పటివరకు ఏకంగా వివిధ రాష్ట్రాలు తిరుగుతూ  60 చోరీలకు పాల్పడ్డాడు అన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఓ వ్యాపారి ఇంట్లో కోటి రూపాయలు విలువైన నగలు, 10 లక్షల నగదును దోచుకు వెళ్ళాడు ఈ రవి పూజారి. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరెస్టు చేసి విచారించగా మిగతా దొంగతనాలకు సంబంధించిన విషయం కూడా బయటపడింది.


 ఇప్పటికే జైలుకు వెళ్లి ఈ ఏడాది ఏప్రిల్ లో అంబాల జైలు నుంచి విడుదలయ్యాడు రవి. ఇక సీసీటీవీ ఫుటేజీ ద్వారా అతన్ని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా రవి పూజారి మొత్తంగా 60 చోరీలకు పాల్పడ్డాడని తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. ఇక అతనికి ఎంతో విలాసవంతమైన ఇల్లు ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ఇల్లు దేవాలయం రెండిట్లో కూడా ఎన్నో ఎగ్జిట్ పాయింట్లు ఉన్నాయని.. అతన్ని ఎప్పుడైనా గుర్తించినట్లు అయితే వాటి నుంచి తప్పించుకోవడానికి వీలుగా ఇల్లు నిర్మించుకున్నాడు అని పోలీసులు చెప్పుకొచ్చారు. ఏదేమైనా పూజారి దొంగగా మారడం మాత్రం సంచలనంగా మారింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: