ఒకప్పుడు బట్టతల అనేది ఎవరికి ఉండేది కాదు. కానీ నేటి రోజుల్లో బట్టతల అంటే సర్వసాధారణం గా మారిపోయింది. మారుతున్న జీవన శైలి ఇక అటు కాలుష్యం కారణంగా ఏకంగా యువకులకు సైతం బట్టతల వచ్చి ఇబ్బంది పడుతున్న పరిస్థితి వస్తుంది. దీంతో కొంతమంది బట్టతల కారణంగా పెళ్లి సంబంధాల రాక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటున్నారు అని చెప్పాలి. ఇక చిన్నప్పుడే తెల్ల వెంట్రుకలు రావడం జరుగుతోంది అని చెప్పాలి.


 అయితే ఇటీవల కాలంలో ఎంతోమంది యువకులు ఇలా బట్టతల వచ్చిందని బాధపడుతున్నారు. అయితే కాస్త డబ్బు ఉన్నవారైతే.. హెయిర్ ప్లాంటేషన్ చేయించుకుని మళ్ళీ తిరిగి జుట్టు పొందగలుగుతున్నారు. కానీ డబ్బు లేని వారు ఇక విగ్గు వాడడం లాంటివి చేస్తున్నారు అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో అటు బట్టలు ఉన్నవారికి పెళ్లి సంబంధాలు సెట్ కాకపోవడంతో.. ఇక తమ బట్టతలను కవర్ చేసుకోవడానికి విగ్గు పెట్టుకొని తమకు హేర్ ఉంది అని నమ్మించి పెళ్లి చేసుకుంటున్న వారు కూడా కనిపిస్తున్నారు.


 అయితే బీహార్ లోని గయాలో కూడా ఒక వ్యక్తి ఇలాగే బట్టతలను దాచి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. అనుకున్నట్లుగానే పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్లి తర్వాత భార్యతో దూరంగా ఉండటం మొదలుపెట్టాడు. ఇక ఇటీవల ఏకంగా రెండో పెళ్లికి కూడా సిద్ధమయ్యాడు. అయితే తనకు బట్టతల ఉంది అన్న విషయాన్ని పెళ్లికూతురుకు చెప్పలేదు. విగ్గుతో బట్టతలను కవర్ చేయాలని చూశాడు.  పెళ్లి రోజు కూడా విగ్ తో మండపంలోకి వచ్చాడు. అతని క్రాఫ్ చూసి వధువు బంధువులకు అనుమానం వచ్చింది. ఇక పరీక్షించి చూస్తే అది విగ్ అని అర్థమైంది. విషయం తెలుసుకున్న వధువు పెళ్లి చేసుకోవడానికి నిరాకరించింది. అంతేకాకుండా వధువు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏకంగావరుడుపై దారుణంగా దాడి చేశారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: