పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రత్యేకమైన ఘట్టం. ఏకంగా నచ్చిన భాగస్వామ్ని జీవితంలోకి ఆహ్వానించి ఇక వందేళ్లపాటు ఎంతో సంతోషంగా వైవాహిక జీవితాన్ని గడపాలని ప్రతి ఒక్కరు కూడా ఆశపడుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇక ఇటీవల కాలంలో మాత్రం పెళ్లి అనేది ఒక కమర్షియల్ ఎలిమెంట్ గా మారిపోయింది. ఏకంగా మంచి ఉద్యోగం లేదా వ్యాపారం ఉన్న అబ్బాయిలను పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు ఇష్టపడుతున్నారు. ఇక మరోవైపు ఉద్యోగాలు సంపాదించలేక ఇక పెళ్లికి సంబంధాలు కుదరక.. ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.


 ఇటీవల కామారెడ్డికి చెందిన ఒక యువకుడు కూడా తనకు ఎంతకీ పెళ్లి కావడం లేదు అన్న కారణంతో మనస్థాపం చెంది  చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే పెళ్లి కాకపోతే ఆత్మహత్య చేసుకోవడం ఏంటి అని ఎంతోమంది ఇక అతను తీసుకున్న నిర్ణయం పై విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి విమర్శలు నేపథ్యంలో ఇక అతను చనిపోవడానికి వెనుక ఏం జరిగి ఉంటుంది అనే విషయంపై ఒక వ్యక్తి చేసిన కామెంట్స్ కాస్త వైరల్ గా మారిపోయాయి. ఇక అతను చేసిన కామెంట్స్ కాస్త అందరిని ఆలోచింపచేస్తున్నాయ్ అని చెప్పాలి.



 పెళ్లి కావడం లేదని ఎవరు ఆత్మహత్య చేసుకోరు.. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు మీ పిన్ని కొడుక్కి అయిపోయింది.. నువ్వు ఎప్పుడు చేసుకుంటావు అని చుట్టూ ఉన్న సమాజం గుచ్చి గుచ్చి అడుగుతుంటే తనకు ఇంకా పెళ్లి కాలేదు అంటే అది అవమానమే అయి ఉంటుంది అని ఇక మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉంటాడు అంటూ ఇక ఈ ఘటనపై ఒక వ్యక్తి పెట్టిన కామెంట్ కాస్త ప్రస్తుతం అందరిని ఆలోచింపచేస్తుంది. అయితే పెళ్లి కావడం లేదని ఏకంగా యువతి యువకుల కంటే పొరుగింటి వారు పక్కింటి వారు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. పెళ్లెప్పుడు అని తరచూ వేధింపులకు గురి చేస్తూ ఉంటారు. ఇలాంటి వేధింపులు చివరికి ఆత్మహత్యలకు కారణం అవుతూ ఉన్నాయి నేటి రోజుల్లో.

మరింత సమాచారం తెలుసుకోండి: