పంట పండించి పదిమంది కడుపు నింపే రైతన్నకు అనుక్షణం ఏదో ఒక  రూపంలో ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి అన్న విషయం తెలిసిందే. కొన్ని కొన్ని సార్లు పంట చేతికి వచ్చే సమయానికి ప్రకృతి విపత్తులు తలెత్తి తీవ్ర నష్టం ఏర్పడుతూ ఉంటుంది. ఇంకొన్నిసార్లు అనుకోని ప్రమాదాల కారణంగా చివరికి పంటం నష్టం వాటిల్లుతూ  ఉంటుంది అని చెప్పాలి  ఇలా ఒక్కసారి పంట వేసిన రైతు ఇక అనుక్షణం పంటను కంటికి రెప్పలా కాచుకుంటూ ఉంటాడు రైతు.


 అయితే కొన్ని కొన్ని సార్లు ఏకంగా అడవి పందులు కూడా పంటను నాశనం చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే అడవి పందులను తరిమికొట్టేందుకు ఎంతో మంది రైతులు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది ఏకంగా ప్రమాదకరం అని తెలిసిన కూడా ఏకంగా పంట చుట్టూ కూడా కరెంటు తీగలను పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు ఆ కరెంటు తీగలు తగిలి చివరికి రైతులే బలవుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇక్కడ ఒక రైతు ఏకంగా పంటలను నాశనం చేసేందుకు వస్తున్న అడవి పందులను తరిమికొట్టేందుకు వినూత్నమైన ఆలోచన చేశాడు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి గోదావరి జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.



 ఉమ్మడి గోదావరి జిల్లాలో ఇక దుంపలను ఎక్కువగా పండిస్తూ ఉంటారు. అయితే పంట చేతికి వచ్చే సమయానికి అడవి పందులు మొత్తం ధ్వంసం చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక రైతుకు కూడా ఇలాంటి ఇబ్బందులు తప్పలేదు. అయితే ఇక్కడ ఓ రైతు ఎవరికి ఇబ్బంది కలగకుండా అడవి పందులను తరిమెందుకు వినూత్నమైన ప్రయత్నం చేశాడు. కాకినాడ జిల్లాలోని కుమ్మర లోవ ప్రాంతంలో ఎక్కువ కొండ ప్రాంతం ఉండడంతో.. చాలా జంతువులు అక్కడికి వస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే అడవి పందుల నుంచి పంటను రక్షించేందుకు.. రైతు తన పంట చుట్టూ ఒక ఇనుప బెండింగ్ వైర్ ను చుట్టాడు. వాటి మధ్యలో కర్రలను ఏర్పాటు చేసి వాటిని బలంగా చుట్టాడు. ఇక వీటిపై జంతువులు దూకడానికి భయపడతాయి. కింది నుంచి వెళ్దామంటే ఆ వైరుకు తాకి ఏదో శబ్దం రావడంతో.. అడవి పందులు భయపడి  పంట లోపలికి పోవడం లేదు. దీంతో ఇక ఆ రైతు పంట వైపు అడవి పందులు రావడం మానేశాయి. ఇక ఈ వినూత్న ప్రయోగం సక్సెస్ కావడంతో ఆ రైతు ఆనందంలో మునిగిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: