నేటి రోజుల్లో మొబైల్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. కేవలం మనిషి అవసరాలు మాత్రమే తీర్చడానికి వచ్చిన మొబైల్ ఏకంగా ఆ మనిషిని బానిసగా మార్చుకుంది. నేటి అధునాతన టెక్నాలజీ జీవితంలో సోషల్ మీడియా కారణంగా ఇక అన్ని మొబైల్ లోనే దొరికేస్తూ ఉండడంతో బయట ప్రపంచంతో పని లేకుండా పోయింది. ఏం కావాలన్నా మొబైల్ లో తెప్పించుకోవడం.. ఏం తెలుసుకోవాలన్న మొబైల్ లోనే తెలుసుకోవడం చేస్తున్నారు. దీంతో ఇక పక్కనున్న మనుషులతో మాట్లాడటం మానేసి ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉన్న మనుషులతో సోషల్ మీడియాలో మాట్లాడేస్తున్నారు.


 అంతలా ఆరడుగుల మనిషిని సోషల్ మీడియా ఆడిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇలా మొబైల్ అతిగా వాడకం కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు బారిన పడుతున్నారు. కొంతమంది చార్జింగ్ పెట్టి మొబైల్ లో ఫోన్ మాట్లాడుతాం కారణంగా చివరికి ప్రాణాలు కూడా కోల్పోతున్న పరిస్థితి ఏర్పడుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎండాకాలంలో ఇక బయటికి వెళ్తే చాలు ఇక మొబైల్స్ వేడెక్కిపోతూ ఉన్నాయి. దీంతో ఇలా వేడెక్కిన మొబైల్ పేలిపోతాయేమో అని ఎంతోమంది భయపడిపోతున్నారు అని చెప్పాలి.


 కాస్త ఎండ తగిలింది అంటే చాలు మొబైల్స్ సాధారణం కంటే ఎక్కువగా హీట్ అవుతూ ఉన్నాయి. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. నిపుణులు  కూడా హెచ్చరిస్తున్నారు.

 ఫోన్ వేడిగా ఉన్నప్పుడు వెంటనే మాట్లాడటం ఆపేయాలి. పౌచ్ తీసి మొబైల్ ను వాడకుండా పక్కన పెట్టాలి.

 ఇక ఫోన్ హీట్ పూర్తిగా తగ్గిన తర్వాతనే చార్జింగ్ పెట్టడం మంచిదని.. లేదంటే పేలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

 అదే సమయంలో ఎండ ఎక్కువగా తగిలే ప్రదేశాలలో ఫోన్ ను పెట్టి చార్జింగ్ అస్సలు పెట్టకూడదు అంటూ హెచ్చరిస్తున్నారు.

 ఇక కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఫోన్ హీటెక్కితే.  ఇక అప్పుడు చార్జింగ్ పెట్టినప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.  

 మరి ముఖ్యంగా ఇలా వేడెక్కిన మొబైల్స్ కి డూప్లికేట్ చార్జర్స్ అస్సలు వాడొద్దు అంటూ సూచిస్తున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: