అవును! ఇప్పుడు ఇదే విష‌యంపై రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ న‌డుస్తోంది. ఏపీ రాజ‌కీయాలు ఎటు ప‌య‌నిస్తున్నా య్‌?  వీటి గ‌మ్యం ఏంటి?  అటు అధికార ప‌క్షం వైసీపీలోను, ఇటు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలోను, ఉన్నామా?  లేమా? అనే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్న క‌మ్యూనిస్టులు, జ‌న‌సేన, కాంగ్రెస్ పార్టీల్లోనూ ఇదే త‌ర‌హా చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ముందు.. అధికార పార్టీ విష‌యానికి వ‌ద్దాం.. పార్టీలో నాయ‌కుల ప‌రిస్థితి అయితే అతి వృష్టి.. లేక‌పోతే.. అనావృష్టి అన్న చందంగా మారిపోయింది. ప్ర‌జ‌ల‌తో ఉండండి అని సీఎం జ‌గ‌న్ పిలుపునిస్తే.. ఇక‌, గ్యాప్ ఇవ్వ‌కుండా ఓ రెండు రోజులు ప్ర‌జ‌ల‌తోనే ఉంటారు. ఇక‌, ఆ విష‌యం పార్టీ అధినేత జ‌గ‌న్ మరిచిపోతే.. ఇంక నాయ‌కులు ఎవరి ప‌నిలో వారు కూల‌బ‌డ‌తారు!


ఇక‌, ఇదే అధికార పార్టీలో కొంద‌రు దూకుడుగా ముందుకు సాగుతున్నారు. మ‌రికొంద‌రు చలిమిడి ముద్ద‌ల్లా అక్క‌డే ప‌డి ఉంటున్నారు. ఫ‌లితంగా నాయ‌కుల‌పై రెండు విధాల ప్ర‌జ‌ల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. కొంత‌రు అతిగా ప్ర‌వర్తిస్తున్నార‌ని, మ‌రికొంద‌రు అస్స‌లు ప్ర‌జ‌లను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వాద‌న బ‌లంగా వినిపి స్తోంది. మ‌రికొన్ని ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. కొంద‌రు మంత్రులు కూడా ఇదే త‌ర‌హాలో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కొంద‌రేమో.. దూకుడు నిర్ణ‌యాలు, వ్యాఖ్య‌లు చేస్తున్నారు. మ‌రికొంద‌రు జ‌గ‌న్ ఏదైనా ప‌ని చెబితే చేయ‌డం లేదంటే మౌనంగా ఉండ‌డం.. దీంతో ఈ రెండు త‌ర‌హా ప‌ద్ధ‌తుల‌ను అవ‌లంభిస్తున్న తీరు చ‌ర్చ‌నీయాంశం గానే మారుతోంది. 


ఇంకొంద‌రు నాయ‌కులు పార్టీలో క‌ట్టుత‌ప్పుతున్నార‌నే వ్యాఖ్య‌లు కూడా వినిపిస్తున్నాయి. నేరుగా పార్టీనే టార్గెట్ చేస్తున్న ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. దీంతో పార్టీలో కొన్ని క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకునైనా స‌రే.. క ట్టు, ప‌ట్టు త‌ప్ప‌కుండా పార్టీని ముందుకు న‌డిపించాల్సిన అవ‌స‌రం ఉంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇక‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ విష‌యానికి వ‌స్తే.. గ‌త ప్ర‌భుత్వంలో దూకుడు ప్ర‌ద‌ర్శించిన నాయ‌కులు ఇప్పుడు పూర్తిగా మూగ‌నోము ప‌ట్టారు. అంతేకాదు, గ‌తంలో చంద్ర‌బాబు ఎవ‌రినైతే ఏరికోరి మంత్రులుగా ఎంపిక చేసుకుని, పార్టీ ఫిరాయించేలా చేసుకుని, త‌న‌కు జైకొట్టించుకున్నారో . వారంతా తెర‌మ‌రుగ‌య్యా రు. అదేస‌మ‌యంలో పార్టీలో గ‌తంలో పెద్ద‌గా గుర్తింపున‌కు నోచుకోని నాయ‌కులు ఇప్పుడు తెర‌మీదికి వ చ్చారు. 


అదేస‌మ‌యంలో యువ నాయ‌క‌త్వం తీవ్ర స్థాయిలో నిరాస‌లో కూరుకుపోతోంది. పార్టీలో ఉండాలో వ‌ద్దో కూడా నిర్ణ‌యించుకోలేక పోతున్నారు. అంద‌రూ అధినేత చంద్ర‌బాబుపై దృష్టి పెట్టారు. ఆయ‌న తీసుకు నే నిర్ణ‌యం కోసం, పార్టీలో ప‌ద‌వుల పందేరం కోసం ఎద‌రు చూస్తున్నారు. ఇది.. నిజానికి పార్టీని పున‌రుజ్జీ వింప చేసే స‌మ‌యంలో ఇబ్బందికి గురి చేసేదేన‌న‌డంలో సందేహం లేదు. ఇక‌, క‌మ్యూనిస్టుల ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారింది. ఏడాది కాలంలో ఎక్క‌డా ప్ర‌జా ఉద్య‌మాలకు పిలుపునిచ్చింది లేదు.. అంటే.. ప్ర‌జారంజ‌క‌మైన పాల‌న సాగుతోంద‌నే అనుకొవ‌చ్చు. అదేవిధంగా జ‌న‌సేన అధినేత ఏకంగా సినిమా షూటింగుల‌కు వెళ్లిపోయాడు. దీంతో ఆ పార్టీ పూర్తిగా నీట మునిగిన‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇలా ఏపీ రాజ‌కీయాలు తాడు బొంగ‌రం లేకుండా .. ఎవ‌రి ఇష్టానికి అనుగుణంగా.. అలా న‌డుస్తున్నాయ‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: