మనలో మతాన్ని అభిమానించే వారు  ఉన్నారు‌‌. అలానే అసలు దేవుణ్ణి నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు.  ప్రత్యేకించి కమ్యూనిస్టులు గతంలో‌ ఈ  మతం అనే మాటను  నమ్మే వారు కాదు . కానీ ఇప్పుడు చూస్తే కమ్యూనిస్టులు మతాన్ని నమ్మడం మాత్రమే కాకుండా ఫాలో అవుతున్నారు కూడా. అలాగని వీళ్ళు హిందూ మతాన్ని నమ్మే మనుషులు కాదు. వీళ్లు ప్రత్యేకించి మైనార్టీ వర్గాలను మాత్రమే, వాళ్ల మతాలను మాత్రమే ఫాలో అవుతుంటారు.


మెజార్టీ వర్గాల నమ్మకాలతో వీళ్ళకి పనిలేదు. హిందూ మతాన్ని ద్వేషిస్తూ ఉంటారు‌. అలాగే ముస్లిం,  క్రైస్తవ మతాలను ఆదరిస్తూ ఉంటారు అని అంటున్నారు కొంతమంది సామాజిక విశ్లేషకులు. అయితే కొంత మంది విషయంలో మతం అనేది మత్తు మందుతో సమానం. వారు తాము నమ్మే మతమే గొప్పదని, అందరూ తమ దేవుడికి భక్తులుగా ఉండి తీరాలి అని బలవంతం చేస్తూ ఉంటారు. అప్పుడు కూడా  వినకపోతే అవతల వాళ్ళని  చంపేస్తూ ఉంటారు. దీన్నే మత మౌడ్యం అని పిలుస్తారు.


ఇలాంటి మత మౌడ్యంతో చెలరేగిపోయిన ఒక వ్యక్తికి సంబంధించిన విషయం ఇప్పుడు  చర్చకు వస్తుంది. మహమ్మద్ అనే ముస్లిం వర్గానికి చెందిన ఒక వ్యక్తి మలేషియా  విమానంలో చేసిన రచ్చ ఇప్పుడు సంచలనం అవుతుంది. తాను అల్లాకు బానిసనని అంటూనే, అందరికీ ఆయనే దేవుడని అలాంటి దేవుడికి అందరూ  బానిసలుగా ఉండాలని చెప్పుకొచ్చాడు ఆ వ్యక్తి. అలా బానిసలుగా ఉండటానికి అంగీకరించకపోతే తాను విమానాన్ని పేల్చేస్తానని అందర్నీ భయపెట్టాడు ఆ వ్యక్తి.


ఎన్ హెచ్ 122 అనే విమానంలో ఈ సంఘటన జరిగినట్లుగా  తెలుస్తుంది. ఆ విమానం కౌలాలంపూర్ నుండి ఆస్ట్రేలియాకు వస్తుండగా ఈ సంఘటన జరిగిందని తెలుస్తుంది. ఆ సందర్భంలో ఆ విమానంలో 194 మంది ప్రయాణికులు  ఉన్నారట. ఇంత రచ్చ చేసి జనాలను భయ భ్రాంతులను చేసిన ఆ వ్యక్తిని చివరికి సిడ్నీ ఎయిర్ పోర్టులో అరెస్టు చేశారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: