జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీ మున్సిపాలిటీ అని కాకుండా ప్రతి ఎన్నికల్లో విజయం సాధిస్తూ దూసుకుపోయింది. ఎక్కడికెళ్లినా ఏ ప్రాంతంలో నైనా, చివరికి కుప్పంలో కూడా గెలిచి తమ సత్తా నిరూపించుకున్నారు.


ఉప ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు, పార్లమెంటు ఉప ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పిటిసి, ఇలా ప్రతి ఎన్నికల్లోను వైసీపీ పార్టీకి ఆధిక్యం లభించింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీకి తిరుగు లేదనిపించేలా జగన్ హవా నడుస్తుందని భావించేట్లు అనిపించింది. అయితే టీచర్ ఎమ్మెల్సీలు గెలిచిన సంతోషం కంటే  ఉద్యోగ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ లో ఓడిపోవడం వైసీపీకి జగన్ కు  మింగుడు పడని అంశం.


ఎందుకంటే రాబోయే ఏడాదిలో ఎన్నికలు జరగనున్నాయి. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటై  దాదాపు నాలుగు సంవత్సరాలు కావస్తుంది. ఈ నాలుగు సంవత్సరాల లోపల ఎక్కడ ఏ ఎన్నిక జరిగిన వైసీపీకే ప్రజలు పట్టం కట్టారు. అలాంటి వైసీపీకి ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో చుక్కెదురైంది.


జగన్ మూడు అంశాలను పరిగణలోకి తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఒకటి వైసీపీ కార్యకర్తలను కాపాడుకోవడం. వైసీపీ కార్యకర్తలకు ఇస్తున్నటువంటి కాంట్రాక్టులకు సంబంధించిన డబ్బులను తొందరగా రిలీజ్ చేయడం. పనిచేసిన వారి డబ్బులను తొందరగా చెల్లిస్తే వారు మరింత చురుకుగా పని చేయడానికి ఆసక్తి చూపుతారు.


ప్రజాప్రతినిధులు వారు చేసే పనులకు సంబంధించి కూడా కాంట్రాక్టులు ఇచ్చిన విషయంలో సరైన సమయంలో డబ్బులు చెల్లిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. తద్వారా కార్యకర్తలను కూడా ఆదుకోవచ్చని అనుకుంటున్నారు.మూడో అంశం ప్రభుత్వ ఉద్యోగులు,ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉద్యోగులు వారి కోరిన కోరికలకు సంబంధించి వారి డిమాండ్లను నెరవేర్చడం. దీనితో  వైసీపీకి అనుకూలంగా మద్దతు తెలిపే అవకాశాలు ఉన్నట్లు  అనుకుంటున్నారు. ఏదేమైనా అన్ని విషయాలను చర్చించి ఓటమిపై విశ్లేషణ చేసుకొని ముందుకెళితేనే, వైసీపీ వచ్చే ఎన్నికల్లో గెలుస్తుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: