చంద్రబాబునాయుడు వ్యవహారం పూర్తిగా గురివింద గింజ లాగ తయారైపోయింది. ప్రకాశం జిల్లాలో పార్టీ సీనియర్ నేత శిద్దా రాఘవరావు వైసిపిలో చేరారు. ఈ విషయమై పార్టీ నేతలతో చంద్రబాబు మాట్లాడుతూ, టిడిపి నేతలను భయపెట్టి, ప్రలోభాలకు గురిచేసి వైసిపి లాక్కుంటోందని మండిపోయారు.  చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు నిజమే అనుకుంటే మరి తాను ముఖ్యమంత్రిగా ఉన్నపుడు జరిగిందేమిటి ? అప్పట్లో జరిగిన ఫిరాయింపులు కూడా భయపెట్టి, ప్రలోభాలకు గురి చేసినట్లు ఒప్పుకుంటున్నట్లే కదా ? ఇక్కడే చంద్రబాబులోని గురివిందగింజ వ్యవహారం బయటపడిపోయింది.

 

2014-19 మధ్య వైసిపికి చెందిన 23 మంది ఎంఎల్ఏలు, 3 ముగ్గురు ఎంపిలను చంద్రబాబు లాక్కున్న విషయం అందరికీ తెలిసిందే. వైసిపి ఎంఎల్ఏలను ప్రలోభాలకు గురిచేసి లాక్కున్న విషయం అందరికీ తెలిసిందే. చివరకు పార్టీ ఫిరాయించినందుకు తమకు ఎంత లాభం వచ్చిందో అప్పట్లో వైసిపి ఎంఎల్ఏలే స్వయంగా చేసిన ప్రకటన సంచలనమైంది.  కొందరు ఎంఎల్ఏలకు అప్పులు తీర్చి మళ్ళీ వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టారని, కొందరు ఎంఎల్ఏలకు మంత్రిపదవులు ఆశచూపారని, ఇంకొందరు ఎంఎల్ఏలకు కాంట్రాక్టులు ఆశచూపారనే విషయంపై విపరీతమైన ప్రచారం అందరికీ తెలిసిందే.

 

అధికారంలో ఉన్నపుడు ఇష్టారీతిన వ్యవహిరంచిన చంద్రబాబు ఇపుడు మాత్రం నీతులు మాట్లాడుతున్నాడు. అంటే తాను అధికారంలో ఉంటే ఒక పద్దతిలో వ్యవహరిస్తాడు.  అధికారంలో ఉన్నపుడు న్యాయం, ధర్మం, నియమ నిబంధనలు, రాజ్యాంగం లాంటివి ఏవీ చంద్రబాబుకు గుర్తుకు రావు.  అదే ప్రతిపక్షంలో ఉన్నపుడు మాత్రం రాజ్యాంగం, విలువల గురించి 24 గంటలు లెక్షెర్లిస్తుంటాడు.  శిద్దా పార్టీ మార్పు విషయం చంద్రబాబు మాట్లాడింది ఇదే. చంద్రబాబు మాట్లాడే మాటలు వింటున్న నేతలకే పెద్ద జోక్ గా ఉంటుంది.

 

ఏదేమైనా అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు వ్యవహరించిన దానికి ఇపుడు పూర్తిగా వ్యతిరేక రాజకీయం జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి ఇంకా చాలా రీజనలబుల్ గా వ్యవహరిస్తున్నాడనే చెప్పాలి. అధికారంలోకి రాగానే టిడిపి ఎంఎల్ఏలను లాక్కోవాలని ప్రయత్నించుంటే ఈపాటికి చాలామంది టిడిపి ఎంఎల్ఏలు వైసిపిలోకి వచ్చేసుండేవాళ్ళనటంలో సందేహం లేదు. కానీ జగన్ ఆపని చేయలేదు. ఈ విషయాన్ని బాహాటంగా అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు మోహం మీదే స్పష్టంగా చెప్పాడు.  కారణాలేవైనా చంద్రబాబు ఇపుడు చేస్తున్న వ్యాఖ్యలను జనాలు కూడా చాలా లైటుగా తీసుకుంటున్నారు.

 

అందుకనే తాను చెప్పదలచుకున్నది, చేయదలచుకున్న వ్యాఖ్యలను పార్టీ నేతల సమక్షంలో మాత్రమే చెప్పగలుగుతున్నాడు. ఎందుకంటే వాళ్ళు నోరిప్పే అవకాశం లేదు కాబట్టి. కానీ నేతలందరికీ తెలుసు అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు ఏమి చేశాడు ? ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఏమి మాట్లాడుతున్నాడు ? అని.  మొత్తం మీద తాజాగా చంద్రబాబు శిద్దా తదితరుల విషయంలో చేసిన వ్యాఖ్యలు సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నట్లే అనిపిస్తోంది.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: