నిన్న రాజ్యాంగ దినోత్సవం.. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు..  రాజ్యాంగ పరిరక్షణ పేరుతో ఓ లేఖ విడుదల చేశారు. అయితే.. ఆ లేఖ చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉందని వైసీపీ నేత కురసాల కన్నబాబు అంటున్నారు.  చంద్రబాబుకు అధికారంలో లేనప్పుడు మాత్రమే రాజ్యాంగం, ప్రజల హక్కులు, బాధ్యతలు గుర్తుకువస్తాయని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు స్వప్రయోజనాలు, సొంతవారి ప్రయోజనాలే గుర్తుంటాయని వైసీపీ నేత కురసాల కన్నబాబు విమర్శించారు.


రాజ్యాంగాన్ని సీఎం వైయస్‌ జగన్‌ పరిరక్షిస్తున్నారా.. లేకపోతే టీడీపీ హయాంలో పరిరక్షించారా..? అనే విషయంపై చర్చకు రావాలని చంద్రబాబుకు వైసీపీ నేత కురసాల కన్నబాబు సవాల్ విసిరారు. దమ్ముంటే చంద్రబాబు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని.. కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలు ఏంటంటే.. ప్రజాస్వామ్యయుతంగా అత్యధిక మెజార్టీతో గెలిచి ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్‌ను  గద్దె దించేయడం రాజ్యాంగ పరిరక్షణ అవుతుందా అని వైసీపీ నేత కురసాల కన్నబాబు ప్రశ్నించారు.


వైయస్‌ఆర్‌ సీపీలో గెలిచిన 23మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేసి, వారిలో 4గురికి మంత్రి పదవులు ఇవ్వడం ఏ రాజ్యంగ స్ఫూర్తి అని వైసీపీ నేత కురసాల కన్నబాబు ప్రశ్నించారు. ఓటుకు కోట్ల కేసు అందరికీ గుర్తుంది కదా... డబ్బులిచ్చి ఓట్లు కొనుగోలు చేయాలని ప్రయత్నించడం ఏ రాజ్యాంగ స్ఫూర్తి అని వైసీపీ నేత కురసాల కన్నబాబు ప్రశ్నించారు. అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ చేసి, ఏ విధంగా 4700 ఎకరాలను ఓత్‌ఆఫ్‌ సీక్రెసీని బ్రేక్‌ చేసి సంపాదించుకున్నారో ప్రజలందరికీ తెలుసన్న వైసీపీ నేత కురసాల కన్నబాబు..  ఈ విషయాన్ని సీఐడీ చెప్పిందని... మంత్రివర్గ ఉపసంఘం కూడా తేల్చిందని.. అది రాజ్యాంగ స్ఫూర్తా అని వైసీపీ నేత కురసాల కన్నబాబు అడిగారు.


దళితులుగా ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని మాట్లాడటం, బీసీల ఆత్మగౌరవాన్ని కించపరించేలా వ్యాఖ్యానించడం, విద్యుత్‌ చార్జీలను తగ్గించాలని రోడ్డు ఎక్కిన రైతులపై కాల్పులు జరిపించి చంపించేయడం ఏ రాజ్యాంగ స్ఫూర్తి అవుతాయని వైసీపీ నేత కురసాల కన్నబాబు ప్రశ్నించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: