వచ్చే ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్‌ అధికారంలోకి వస్తుందని మంత్రి కేటీఆర్ అంటున్నారు. తాము అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని మంత్రి కేటీఆర్ చెబుతునత్నారు. ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, మరొకవైపు అభివృద్ధి కొత్త నమూనాను భారతదేశం ముందు ఆవిష్కరిస్తూ పట్టణ, అభివృద్ధి, పరిశ్రమలు,పర్యావరణం, వ్యవసాయం, ఐటీ సమతుల్యమైన కొత్త ఇంటిగ్రేటెడ్‌ హెలిస్టిక్‌ మోడల్‌ను భారతదేశం ముందు సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని కేటీఆర్ అంటున్నారు.


తెలంగాణ వచ్చిన సమయంలో రాష్ట్ర తలసరి ఆదాయం 1.24లక్షలని, తెలంగాణ వచ్చిన ఏడేళ్లలో 2.78లక్షల తలసరి ఆదాయంతో దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందని గర్వంగా చెబుతున్నామని కేటీఆర్ అంటున్నారు. జీఎస్‌డీపీ తెలంగాణ వచ్చిన సమయంలో 5.6లక్షల కోట్లని, ఇప్పుడు 11.55లక్షల కోట్లుగా ఉందని కేటీఆర్‌ చెబుతున్నారు. భారతదేశంలో అత్యుత్తమ గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు తెలంగాణాలో ఉన్నాయని కేటీఆర్‌ అన్నారు.


స్వచ్ఛ సర్వేషన్‌ -2022లో భాగంగా 26 అవార్డులు కేంద్రం ప్రభుత్వం ఇచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలో 240కోట్ల మొక్కలు నాటడం సంతోషకరమని కేటీఆర్‌  అన్నారు. పంచాయతీలు, మున్సిపాలిటీ పంచాయతీల్లో గ్రీన్‌ బడ్జెట్‌ తీసుకువచ్చి హరితహారం ద్వారా 7.7శాతం గ్రీన్‌ కవర్‌ సాధించామని కేటీఆర్‌  అన్నారు. 24శాతం ఉన్న పచ్చదనం ఇవాళ 31.7శాతానికి చేరిందని, ఇది రాష్ట్రానికే గర్వకారణమని కేటీఆర్‌ అన్నారు.


తెలంగాణలో ఏ పల్లెకు, హైదరాబాద్‌లో ఏ మూలకు వెళ్లినా పచ్చదనం కనిపిస్తుందని కేటీఆర్‌  అన్నారు. ఎస్‌.ఎన్‌.డీ.పీ పథకం కింద జీహెచ్‌ఎంసీ పరిధిలో 34 పనులు చేపడుతున్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అందులో రెండు పూర్తయ్యాయని, డిసెంబర్‌ చివరి నాటికి 17 పనులు పూర్తి చేస్తామన్న కేటీఆర్‌.. మరో 15 పనులు జనవరి వరకు పూర్తి చేస్తామన్నారు. హుస్సేన్‌ సాగర్‌ సర్ఫేస్‌ నాలా, బుల్కాపూర్‌ నాలా ఎండాకాలం వరకు పూర్తి చేస్తామని కేటీఆర్‌ అన్నారు. కేటీఆర్ చెబుతున్న అభివృద్ధి నిజమే అయినా.. మరోవైపు దూసుకొస్తున్న బీజేపీ కూడా ధీమాగానే ఉంది. చూడాలి మరి 2023లో ఎవరిదిపై చేయి అవుతుందో?

మరింత సమాచారం తెలుసుకోండి: