
సీక్రెట్ క్రెమ్లిన్ డాక్యుమెంటరీ పేరుతో అమెరికా ఒక సంచలన విషయాన్ని బయటపెట్టింది. మాల్దోవ్ దేశంలో ఉండే ప్రజలు రష్యాకు మద్దతుగా ఉంటున్నారు. కానీ అమెరికా ప్రభుత్వానికి మాల్దోవ్ ప్రభుత్వం సపోర్టుగా ఉంటుంది. కానీ ప్రజలు మాత్రం రష్యాలో మనం గతంలో అంతర్భాగం కాబట్టి రష్యా కు వ్యతిరేకంగా వెళ్లకూడదన్నది మాల్దోవ్ ప్రజల అభిమతం. అమెరికా చెప్పు చేతల్లోకి ఎందుకు వెళ్లాలని ప్రజలు అడుగుతున్నారు.
దీంతో అమెరికా రష్యా పై ఆరోపణలు గుప్పిస్తోంది. మాల్దోవ్ ఉన్న ప్రభుత్వాన్ని పుతిన్ బెదిరింపులకు దిగి తనకు సపోర్టుగా ఉండాలని కోరుతున్నారు. ప్రజలమో అమెరికా సాయం కావాలని కోరుతున్నారని అమెరికా ఆరోపిస్తోంది. కానీ ఇదే అమెరికా ప్రస్తుతం తైవాన్ లో తన అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తూనే ఉంది. తైవాన్ తాను చెప్పినట్లు వినేలా అమెరికా కోరుకుంటుంది.
ఇరాక్ లో, అఫ్గానిస్తాన్ లో కూడా ఇలాంటి ద్వంద విధానాలతో నే అక్కడ ప్రభుత్వాలను నడిపించింది. అమెరికాకు అయితే ఒక న్యాయం, రష్యా కైతే మరో న్యాయమా అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మాల్దోవ్ ప్రజలు, ప్రభుత్వం రష్యాకు అండగా ఉంటేనే మరో ఉక్రెయిన్ కాకుండా ఉంటుంది. లేకపోతే రష్యా చేసే దాడులు, బీభత్సం తట్టుుకోలేదు. సాయమందిస్తామని చెప్పినా అమెరికా చివరి సమయంలో చేతులెత్తేసే రకం. కాబట్టి గతంలో మాల్దోవ్ రష్యా లో అంతర్భాగం కాబట్టి రష్యకు సపోర్టు చేయడంలో తప్పేమీ లేదనిపిస్తోంది.