
కానీ, దీనికి విరుద్ధంగా నారా లోకేష్ పేరు ఇప్పుడు విశాఖలోనూ వినిపిస్తోంది. ఎక్కడ ఏ నలుగురు చేరినా.. `నారా లోకేష్ వల్లే.. మనకు టీసీఎస్ వస్తోంది` అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రఖ్యాత ఐటి దిగ్గజం టిసిఎస్ కు విశాఖలో 21.16 ఎకరాలను 99 పైసలకు కేటాయిస్తూ రాష్ట్రప్రభుత్వం విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దీని వెనుక మంత్రి నారా లోకేష్ ఉన్నారంటూ.. పెద్ద ఎత్తున జిల్లాలో చర్చ సాగుతుండడం గమనార్హం.
ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 5 లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో మంత్రి నారా లోకేష్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయని విశాఖ ప్రజలు చెబుతున్నారు. మంత్రి లోకేష్ గతఏడాది అక్టోబర్ లో ముంబయ్ లోని టిసిఎస్ హౌస్ ను సందర్శించి రాష్ట్రంలో డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాల్సిందిగా టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ కు విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత టిసిఎస్ ప్రతినిధులతో నిరంతర చర్చలు సాగించి చివరకు విజయం సాధించారు.
విశాఖలో టిసిఎస్ డెవలప్ మెంట్ సెంటర్ కోసం ఆ సంస్థ రూ.1370 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా యువతకు 12వేల ఐటి ఉద్యోగాలు లభించనున్నాయి. విశాఖ నగరాన్ని ఐటి హబ్ గా మార్చడానికి మంత్రి నారా లోకేష్ చేస్తున్న కృషిలో టిసిఎస్ గేమ్ ఛేంజర్ కాబోతోంది. రాష్ట్రంలో ఐటీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆయన ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. విశాఖలో డాటా సెంటర్ల ఏర్పాటుకు ప్రముఖ సంస్థలు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకునే నారా లోకేష్‌పై విశాఖ వాసులు ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఆయన పేరును మననం చేసుకుంటున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌తో సమస్య మీది.. పరిష్కారం మాది..
అవినీతి అయినా.. లంచాలైనా.. రాజకీయ నాయకులు పెట్టే ఇబ్బందులు అయినా మీ సమస్యను మా సమస్యగా భుజాన వేసుకుంటాం. నేతలు పట్టించుకోవడం లేదని.. అధికారులు దురుసుగా వ్యవహరిస్తున్నారని చింతించాల్సిన అవసరమే లేదు. రండి.. చేయి చేయి కలుపుదాం.. మీ చింత తీర్చుదాం. మీ సమస్య ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.. పరిష్కార మార్గాన్ని పొందండి.