
ఏపీ సీఎం చంద్రబాబు తన మంత్రివర్గంలోని మంత్రులకు ఒక్కొక్క జిల్లాకు బాధ్యత అప్పగించారు. ఆయా జిల్లాలలో ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రచారం చేయడంతో పాటు .. పార్టీని ముందుండి నడిపించడంతోపాటు పార్టీ ఎమ్మెల్యేలు .. నాయకుల మధ్య సమన్వయంలో కీలకపాత్ర పోషించాలని చంద్రబాబు జిల్లా ఇన్చార్జి మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు. పార్టీ నాయకులు మధ్య అంతర్గత కుమ్మలాటలు రాకుండా చూడాలని దిశా నిర్దేశం చేశారు. ఇలా ఏపీలో ఉన్న 25 జిల్లాల బాధ్యతలను ముఖ్యమంత్రి అప్పగించారు. అయితే ఆయా జిల్లాలలో ఆ మంత్రులు పర్యటిస్తున్నారా ? చంద్రబాబు చెప్పినట్టు చేస్తున్నారా అంటే ప్రశ్నార్ధకమే..! ఏదో చంద్రబాబు అలా వదిలించినప్పుడు మాత్రమే చుట్టపు చూపుగా ఆయా జిల్లాలకు వెళుతున్నారు.. లేకపోతే మౌనంగా ఉంటున్నారు.
అసలు తనకు అప్పగించిన జిల్లాలలో ఒక్కసారి కూడా పర్యటించని మంత్రులు ఉన్నారంటే చంద్రబాబు మాట అంటే ఈ మంత్రులకు ఏమాత్రం లెక్క లేదని అర్థమవుతుంది. అసలు కొన్నిచోట్ల పార్టీలో గ్రూపుల గోల ఎక్కువ అవుతుంది. వారు ఎవ్వరు కూడా ఆ దిశగా పార్టీ నాయకుల మధ్య సమన్వయం చేస్తున్న దాఖలాలు లేవు. ఇలా మంత్రులు పట్టించుకోకపోవటానికి అంతర్గత వ్యవహారాలతో పాటు తమ బిజీ షెడ్యూల్ కారణమని చెబుతున్నారు. చాలా జిల్లాలలో సీనియర్లు - జూనియర్ల మధ్య రాజకీయం జోరుగా సాగుతోంది. దీంతో మంత్రులు చాలా వరకు వాటి జోలికి పోకుండా తమ పనులు తాము చేసుకుంటున్నారు. దీంతో జిల్లాలలో ఇన్చార్జి మంత్రుల హవా కనపడటం లేదన్నది వినిపిస్తున్న టాక్.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు