
ప్రస్తుతం ప్రపంచదేశాలను కరోనా వైరస్ కమ్మేసింది. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైరస్ క్రమంగా అన్ని దేశాలు వ్యాప్తి చెందుతూ ప్రజలను బలి తీసుకుంటోంది. ఈ క్రమంలోనే దేశదేశాలు లాక్‌డౌన్ విధించడంతో పాటు కరోనా కట్టడికి కఠన చర్యలు తీసుకుంటోంది. దీంతో ప్రజలందరూ ఇంటికే పరిమితం అయ్యారు. ఇలాంటి టైమ్‌లో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిసింది ఇస్రో. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్-ISRO ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే.
మొత్తం 55 సైంటిస్ట్ / ఇంజనీర్, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ బీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఇస్రో. ఇంజనీర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, టెక్నీషియన్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు.అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్-SAC కోసం ఈ నోటిఫికేషన్ జారీ చేసింది ఇస్రో. ఇక దరఖాస్తు గడువు ఏప్రిల్ 3 వరకేనని నోటిఫికేషన్‌లో ప్రకటించింది ఇస్రో. అయితే కరోనా వైరస్ కారణంగా సంక్షోభం నెలకొనడంతో దరఖాస్తు గడువును 2020 మే 1 వరకు పొడిగించింది. ఇక నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు https://recruitment.sac.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
అలాగే ఈ నోటిఫకేషన్‌లో మొత్తం 55 ఖాళీలు ఉండగా.. అందులో సైంటిస్ట్ / ఇంజనీర్- 21, టెక్నికల్ అసిస్టెంట్- 6 మరియు టెక్నీషియన్ బీ - 28 ఉన్నాయి. ఇక విద్యార్హత విషయానికి వస్తే.. సైంటిస్ట్ / ఇంజనీర్ పోస్టుకు ఎలక్ట్రానిక్స్‌లో పీహెచ్‌డీ, ఎంఎస్సీ ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో ఎంఈ లేదా ఎంటెక్. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు ఇంజనీరింగ్‌లో డిప్లొమా ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావాలి. టెక్నీషియన్ బీ పోస్టులకు 10వ తరగతి, ఐటీఐ. 2020 మార్చి 27 నాటికి 18 నుంచి 25 ఏళ్లు ఉండాలి.