గత ఏడు నెలల నుంచి దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఒంటి కాలి పై నాట్యం చేస్తుంది. చాలా మంది ప్రాణాలను కోల్పోయారు.. మొత్తం ఆర్థిక వ్యవస్థ దెబ్బ తిన్నది. దీంతో అన్నీ సంస్థలు మూతపడ్డాయి. ముఖ్యంగా విద్యా, వ్యాపార సంస్థలను పూర్తిగా మూసివేశారు. ఇటీవల కాలంలో కొన్ని సడలింపులు చేయడం వల్ల మళ్లీ వ్యాపారాలు తెరుచుకున్నాయి. ఇక పెద్ద తరగతులకు క్లాసులకు ప్రారంభించిన ప్రభుత్వం ఇప్పుడు ప్రైమరీ స్కూల్స్ ను కూడా ప్రారంభించే ఆలోచన లో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకోసం ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. విద్యార్థులకు విద్యా కానుక పథకం కింద విద్యా కిట్ ను కూడా అందజేశారు..



ఈ మేరకు ఏపి ప్రభుత్వం నవంబర్ 2 నుంచి పాఠశాలలు, కాలేజీలు తెరుచుకొనున్నాయి.. ఇక పోతే తెలంగాణ లో కూడా పాఠశాలలు మొదలు కానున్నాయి. అందుకోసం ఒకటి , పది తరగతులకు సిలబస్ ను ఖరారు చేసారు. సిలబస్‌ లోని అధ్యాయాలను తరగతి గదిలో బోధించాల్సినవి, ప్రాజెక్టు ఆధారితమైనవి అంటూ రెండుగా విభజించింది. ప్రాజెక్టు ఆధారిత అధ్యాయాలకు సంబంధించిన సిలబస్ బోర్డు పరీక్షలకు సంబంధించి ఉంటుందని విద్యా శాఖ వెల్లడించింది.



వచ్చే ఏడాది విద్యా సంవత్సరం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ సర్కార్ పేర్కొన్నారు. డీఈవోలు, ఆర్‌జేడీలు ప్రధానోపాధ్యాయులకు సూచనలు ఇవ్వాలని ఆదేశించారు.  విద్యార్థులు ఏడు నెలల నుంచి ఖాళీగా ఉండి పాఠ్యాంశాలను మర్చిపోయారు. కొత్త సిలబస్ ను వారికి అర్థమయ్యే రీతిలో విద్యార్థులకు చెప్పాలని ఆదేశించారు. మ్యాథ్స్ 30 శాతం, పిజిక్స్ 27 శాతం, న్యాచురల్ సైన్స్ 30 శాతం, సోషల్ 29 శాతం, ఇంగ్లిష్ ‌లో 25 శాతం ప్రాజెక్టు ఆధారిత సిలబస్‌ లో చేర్చారు. అయితే వాటినుంచి పరీక్షల్లో ప్రశ్నలు రావు. ఏయే తరగతుల్లో ఏ అధ్యాయాలను ప్రాజెక్టుల కోసం కేటాయించారో పూర్తి వివరాలను..
https:/www.scert.telangana.gov.in/ అనే వెబ్‌సైట్లో చూసుకోవచ్చునని తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: