పీ జీ చదువులు చదవాలంటే మాత్రం ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. ఒక వేల కళాశాలలో ఉచిత విద్య ను పొందితే సరిపోతుంది. కానీ సీట్ సంపాదించలేని యెడల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు అలాంటి వారందరి కోసం నాబార్డ్ సంస్థ ఒక శుభవార్త ను తీసుకు వచ్చింది. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ NABARD స్టూడెంట్ ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్ ను ప్రారంభించింది. నాబార్డ్ అధికారిక వెబ్సైట్ అయిన https://www.nabard.org/లో  దరకాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.

అప్లై చేయడానికి 2021 మార్చి 5వ తేదీన చివరి తేదీ గా ప్రకటించింది. 2021-2022 సంవత్సరానికి గాను మొత్తం 75 ఇంటర్న్షిప్ కాళీలను ను ప్రకటించింది నాబార్డ్. ప్రస్తుతం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్న్ షిప్ కు అప్లై చేసుకోవచ్చు. అయితే ఇది 2 నెలల ఇంటర్న్ షిప్ మాత్రమే. ఇందులో ఎంపికైన వారికి  ఒక్కొక్క నెలకు రూ.18,000 చొప్పున రెండు నెలలకు స్టైపెండ్ తోపాటు ఫీల్డ్ అలవెన్స్ లభిస్తుంది.

మొత్తం ఖాళీలు  : 75
దరఖాస్తు  ప్రక్రియ :
ప్రారంభం :  2021 ఫిబ్రవరి 9
దరఖాస్తుకు చివరి తేదీ : 2021 మార్చి 5
ఇంటర్న్‌షిప్ తేదీలు :  2021 ఏప్రిల్ 1 నుంచి ఆగస్ట్ 31 వరకూ
ఇంటర్న్‌షిప్ గడువు : 2 నెలలు
స్టైపెండ్  : నెలకు రూ.18,000
విద్యార్హతలు : పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ సెకండియర్ చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసే అవకాశం వుంది. ఇందులో అగ్రికల్చర్, వెటర్నరీ, ఫిషరీస్, అగ్రి బిజినెస్, ఎకనామిక్స్, సోషల్ సైన్సెస్, మేనేజ్‌మెంట్‌లో పీజీ చేస్తుండాలి. వీరితో పాటు ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు చేస్తున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేయొచ్చు.

ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులు షార్ట్ టర్మ్ టాస్కుల ను పూర్తి చేయాలి. వీటితో పాటు ప్రాజెక్ట్స్ లేదా స్టడీస్ ఉంటాయి. ఇవన్నీ నాబార్డ్ బ్యాంకుకు సంబంధించినవే ఉంటాయి. వీటితో పాటు రూరల్ మార్కెట్లు, హోమ్‌స్టే, రూరల్ టూరిజం, స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్, మైక్రో ఏటీఎం, ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్ లాంటివాటిపైనా ప్రాజెక్ట్స్ రూపొందించాల్సి ఉంటుంది. స్టూడెంట్స్ మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఇతర ఖర్చులకు అప్లై చేసుకోండి. ఇంటర్న్షిప్ చేయడం ద్వారా ఎన్నో పలు రంగాలలో అవగాహన కల్పించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: