
ఇక అంతే కాదు అన్ని కళాశాలలకు ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ఒకేసారి విద్యార్థులు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే .. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5,060 ఎం బి బి ఎస్ ప్రభుత్వ సీట్లు ఉండగా ప్రైవేటు వైద్య కళాశాలల్లో 5,060 ఎంబిబిఎస్ సీట్లు ఉన్నాయి. ఇక ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు అదనపు సీట్లూ కలుపుకుని మొత్తం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలో 2,185 సీట్లు ఉన్నాయి. ఇక ఆలిండియా కోటాలో 325 సీట్లు ఉండగా.. రాష్ట్ర కోటాలో 1,860 సీట్లు భర్తీ చేయనున్నారు.
ఇక రాయలసీమ విషయానికి వస్తే తిరుపతిలో శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాలలో 175 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఇందులో కూడా ఆల్ ఇండియా కోటా కింద 26 సీట్లను కేటాయించగా ఎన్నారై కింద 23 సీట్లు కేటాయించారు. మిగిలిన 126 సీట్లు రాష్ట్ర కోటలోకి రావడం గమనార్హం.17 ప్రైవేట్ వైద్య కళాశాలలో 2700 సీట్లు ఉన్నాయి. ఇక వీటిలో ఏ కేటగిరీలో 1,350 సీట్లు.. బి కేటగిరీ కింద 938 సీట్లు..సీ కేటగిరీకి 412 సీట్లు ఉన్నాయి. ఇక వీటన్నింటిని మరో మూడు రోజుల్లో భర్తీ చేయనున్నట్లు సమాచారం.