గత రెండు రోజుల నుండి బంగారం ధరలు మళ్ళి తగ్గుముఖం పట్టాయి. అయితే అక్టోబర్ ఫ్యూచర్స్ 10 గ్రాములు రూ.51,909, సెప్టెంబర్ ఫ్యూచర్స్ రూ.52,089 పలికిందని నిపుణులు వెల్లడించారు. డిసెంబర్ డెలివరీ దాదాపు రూ.700 తగ్గి రూ.52,124 పలికింది. ఈ రెండింటి ధరలు కూడా 1.4 శాతం మేర తగ్గాయన్నారు. ఇక వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అంతేకాకుండా కిలో వెండి రూ.900కు పైగా పడిపోయి రూ.66 వేల పైన పలికింది. బంగారం ఇంట్రాడే లో అత్యధికంగా రూ.52,550, కనిష్టం రూ.51,721 పలికింది. బంగారం ధరలు రెండు రోజుల్లో రూ.1600 వరకు తగ్గిందని నిపుణులు తెలిపారు.


బంగారం ధరలు  తగ్గుముఖం పట్టినట్టే పట్టి గత రెండు రోజుల్లో రూ.1500 వరకు పెరిగింది. అయితే ఈ రోజు దాదాపు రూ.1400కు పైగా పడిపోయిందని నిపుణులు తెలిపారు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు ఒడిదుడుకుల్లో ఉండటంతో దేశీయ మార్కెట్లో పసిడి, వెంటి ధరలు క్షీణించాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరల్లో అనిశ్చితి నెలకొందని నిపుణులు వెల్లడించారు.


అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు అంతకుముందు సెషన్‌లో 3 శాతం పడిపోయాయి. నేడు స్వల్పంగా పెరిగాయి. స్పాట్ గోల్డ్ 0.4 శాతం పెరిగి 1937 వద్ద ట్రేడ్ అయింది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ మాత్రం 1.3 శాతం పడిపోయి 1944.20 వద్ద ట్రేడ్ అయింది. కామెక్స్‌లో పసిడి ధరలు ట్రాయ్ ఔన్స్ 1920 నుండి 1975 రేంజ్‌లో ఉండవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.


ఇక నేడు హైదరాబాద్, విజయవాడల్లో 24 క్యారెట్ల పసిడి నిన్న రూ.56,240 ఉంది. ఈ రోజు రూ.800 వరకు తగ్గి రూ.55,460 పలికింది. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములు రూ.51,560 నుండి రూ.700కు పైగా తగ్గి రూ.50,840 పలికింది. చెన్నైలో 24 గ్రాముల పసిడి రూ.55,460 ఉండగా, 22 క్యారెట్లు రూ.50,840 పలికిందని నిపుణులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: