బంగారం అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారా..? నో వే.  చిన్న - పెద్ద - లోయర్ - మిడిల్ - అప్పర్ క్లాస్ అందరి కి బంగారం అంటే ఇష్టమే కానీ కొనుక్కోవడమే కష్టం . ప్రతి ఒక్కరు బంగారం కొనుక్కొని సేవ్ చేసుకోవాలి అని అనుకుంటారు కానీ కొందరికి అది వీలు పడుతుంది మరికొందరికి వీలుపడదు.  వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ బట్టే అంతా ఉంటుంది . అయితే కచ్చితంగా మహిళలు బంగారాన్ని ధరించడానికి బంగారు ఆభరణాలు వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అసలు బంగారం అంటే ఇష్టం లేని ఆడవాళ్లు ఈ లోకంలో ఎవ్వరు కూడా ఉండరు . అంత ప్రీతికరం ఆడవాళ్ళకి బంగారం అంటే . అయితే ఆ బంగారం రోజు రోజుకి రేటు వేలు నుంచి లక్షలకి దాటిపోతుంది.
 

ఒక గ్రామ బంగారం కొనాలి అంటే కచ్చితంగా 10,000 రూపాయలు చేతిలో ఉండాల్సిందే . ఇక మేకింగ్ చార్జెస్ అవి ఇవి జిఎస్టి అంటూ చూసుకుంటే అది 11000 దాటిపోతుంది.  అప్పట్లో ఒక కాసు ఒక గ్రాము బంగారం కొనాలి అంటే 500 - 700 ఉంటే సరిపోయేది . ఇప్పుడు మాత్రం ఒక గ్రామ బంగారం కొనాలి అంటే చేతుల 11000 పెట్టుకొని షాప్ కి వెళ్ళాలి . ఈ కారణంగానే ఈ మధ్యకాలంలో ఏ పండుగ అయినా ఆడవాళ్లు బంగారం కొనడమే మానేసుకున్నారు.  ఆ డబ్బుని వేరే విధంగా ఉపయోగించుకుంటున్నారు . కానీ ఇప్పుడు ఎప్పుడూ ఎప్పటికీ కూడా ఆడవారికి అసలైన అలంకారం బంగారం తోనే వస్తుంది అని అంటుంటారు పెద్దవాళ్ళు .



ఎవరి రేంజ్ కి తగ్గట్టు వాళ్ళు బంగారం కొనుక్కోవడానికి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు.  అయితే ప్రతి ఒక్కరు కూడా వాళ్లకు నచ్చిన బంగారు నగలను చేయించుకోవాలి అనుకుంటే కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది అంటున్నారు నిపుణులు . మరీ ముఖ్యంగా లోయర్ క్లాస్ ..బిలో లోయర్ క్లాస్ వాళ్ళు బంగారం ఈజీగా సేవ్ చేసుకునే టిప్స్ చెప్తున్నారు.  ఒకేసారి రెండు లక్షలు మూడు లక్షలు పెట్టి బంగారం కొనాలి అంటే అది ఎవరికి సాధ్యపడదు.  మరీ ముఖ్యంగా లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అస్సలు సాధ్యపడదు.  అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే డబ్బున్నప్పుడల్లా ఎంత వీలైతే అంత మొత్తంలో వాళ్ళ దగ్గర ఉన్న సొమ్ముకి బంగారు కాయిన్స్ కొనుక్కొని పక్కన పెట్టుకోవాలి.



ఆ బంగారు కాయిన్స్ ఆ తర్వాత వాళ్లకి నచ్చిన ఆభరణం చేయించుకోవచ్చు . మరీ ముఖ్యంగా ఇంట్లో ఆడపిల్ల ఉన్నప్పుడు బంగారం పెళ్లి కోసం చేర్చి పెట్టాలి అనుకునే వాళ్ళకి ఈ టిప్ బాగా ఉపయోగపడుతుంది అంటున్నారు నిపుణులు.  ఒకేసారి మనం 40-50 కాసులలో బంగారం చేయించాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది . అంత డబ్బు ఒకేసారి ఒకే దానిపై పెట్టాలి అన్న మనసు రాదు . అలాంటి వాళ్ళు ఇలా చిన్నచిన్నగా ఉన్న డబ్బుతో ఒక గ్రాము రెండు గ్రాములు మూడు గ్రాములు అలా పది గ్రాములు 15 గ్రాములుగా బంగారం చేర్చుకొని పెద్ద ఆభరణాలు చేయించుకోవచ్చు అని అప్పుడు వాళ్ళకి డబ్బు వృధాగా పోదు వాళ్ల కోరిక కూడా తీరుతుంది అంటూ సజెషన్స్ ఇస్తున్నారు . ఇలా ప్రతి ఒక్కరు చిన్న చిన్నగా గోల్డ్ కాయిన్స్ సేవ్ చేసుకుంటే ఫ్యూచర్లో అది వాళ్ళకి మంచి ఆస్తిగా కూడా మారుతుంది అంటూ చెప్తున్నారు గోల్డ్ ఎక్స్పర్ట్స్..!

మరింత సమాచారం తెలుసుకోండి: