
ఉలవలు.. వీటిని భారతీయులు విరివిరిగా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా ఉలవలతో చేసే ఉలవచారు దేశవ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయింది. నవ ధాన్యాల్లో ఒకటైన ఈ ఉలవలు.. ఆరోగ్యానికి చేపే మేలు అంతా ఇంతా కాదు. అందుకే ఉలవల్లో ఉన్నన్ని పోషకాలు మరే ఇతర ధాన్యంలోనూ ఉండవంటారు. మరి ఈ ఉలవలు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం. కిడ్నీవ్యాధులతో బాధపడేవారికి ఉలవలు బెస్ట్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు.
అవును! కిడ్నీ సమస్యలను తగ్గించడంలో వీటికి సాటి మరేమీ లేవు. కిడ్నీలో ఏర్పడిన రాళ్లను కరిగించడంతో ఉలవలు గ్రేట్‌గా సహాయపడతాయి. అలాగే ఉలవలను, కొత్త బియ్యాన్నీ సమంగా తీసుకొని జావమాదిరిగా తయారుచేయాలి. దీనిని పాలతో కలిపి కొన్ని రోజుల పాటు క్రమంతప్పకుండా తీసుకుంటే లైంగిక శక్తి, శృంగారానురక్తి పెరుగుతాయి. మరియు ఉల్లవల్లో ఉంటే కాల్షియం ఎముకులకు, కండరాలకు శక్తినిస్తుంది. ఇక ఇందులోని ఫైబర్ మలబద్దకం రాకుండా అడ్డుకుంటుంది. దగ్గు, ఉబ్బసంతో బాధపడుతున్నవారు ఉలవల కషాయం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
అంతేకాకుండా.. బరువు తగ్గాలనుకునేవారికి ఉలవలు మంచి ఆహారంగా చెప్పుకోవచ్చు. ప్రతి రోజు ఉలవలు తీసుకోవడం వల్ల.. శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. రక్తహీనతతో బాధపడేవారు తరచూ ఉలవలను కషాయంగా కాని, చారు రూపంలా గాని తీసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. ఉలవల్లో పాస్ఫరస్, ఫైబర్, ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల శరీరానికి చక్కని పోషణను అందిస్తాయి. అలాగే ఉలవలు తీసుకోవడం మరో ఉపయోగం ఏంటంటే.. శరంలో రోగాలతో పోరాడే ఇమ్యూనిటీ పవర్‌ను సైతం పెంచుతుంది. ఉలవల్లో ప్రోటీన్లు సమృద్ధిగా ఉండడం వల్ల ఎదిగే పిల్లలకు ఇవి మంచి ఆహరం.