వామును మనం ఎక్కువగా కిచెన్ లో ఉపయోగిస్తుంటాము.  వాము వల్ల వంటకు రుచి, సువాసన వస్తుంది. వామును ఎక్కువగా జంతికలు, మురుకులు లాంటి నిల్వ చేసే పదార్థాలలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఒకవేళ వాము ఆ వంటలకు జోడించికపోతే, అవి అంతగా రుచిగా అనిపించదు. అయితే వాము వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. అయితే వాము వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..


వాము తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఒకవేళ జలుబు, మైగ్రేన్, తలనొప్పి లాంటి సమస్యలు  వచ్చినప్పుడు,వాము పొడిని ఒక గుడ్డలో కట్టి వాసన చూస్తూ ఉంటే క్రమంగా ఆ సమస్య తగ్గిపోతుంది. అంతేకాకుండా వాంతులు ఎక్కువగా అవుతున్న వారిలో వాము ను నీళ్లలో నానబెట్టి, ఆ నీటిలో కొద్దిగా ఉప్పు వేసుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది. అలాగే జ్వరం తీవ్రతరం చేసినప్పుడు వాము,ధనియాలు, జీలకర్ర అన్నీ కలిపి కషాయం చేసుకుని తాగితే జ్వరం చిటికెలో తగ్గిపోతుంది.


గొంతులో ఇబ్బందిగా ఉన్నట్టు అనిపిస్తే, దవడకు వామును పెట్టుకొని, ఆ రసాన్ని నెమ్మదిగా మింగుతుంటే గొంతు నొప్పి తగ్గుతుంది. అంతే కాకుండా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి వాము చక్కటి ఔషధం.. ఆస్తమాతో బాధపడుతున్న వారు వాము లో కొద్దిగా బెల్లం కలుపుకుని తినడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది. అసిడిటీ తగ్గాలంటే వాము, జీలకర్ర ను నీటిలో మరిగించి,ఆ నీటిని వడగట్టి తాగితే తగ్గిపోతుంది.


గర్భవతులు కూడా రెగ్యులర్ గా ఈ వాము తినడం వల్ల రక్తం శుభ్రం అవుతుంది. అలాగే శరీరంలో రక్త ప్రసరణ  జరిగేలా చూస్తుంది. అంతేకాకుండా కడుపునొప్పితో బాధపడుతున్న వారు కూడా ఈ వామును కొద్దికొద్దిగా నములుతూ, రసాన్ని మింగటం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మీరు నిల్వ ఉంచుకునే జంతికలు,మురుకులు లాంటివి కాకుండా, అప్పుడప్పుడు వీలైనంతవరకూ వామును తింటూ ఉండండి. వాము వల్ల కలిగే ప్రయోజనాల వల్ల  మనకు మంచి చేకూరుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: