శరీరంలో ఉండే ప్రతి పార్ట్ కి కూడా ఇతర అవయవంతో సంబంధం ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఒక అవయవానికి ఏదైనా సమస్య వస్తే దాని ప్రభావం మరో అవయవంఫై కూడా పడుతుందని నిపుణులు చెబుతుంటారు. అయితే దంతాలు కూడా  అటు ఎంతోమంది లో వివిధ రకాల సమస్యలకు కారణం అవుతాయి అన్న ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది.  అయితే దంతాలు ప్రతి మనిషికి అందాన్ని తీసుకు వస్తూ ఉంటాయి. దంతాలు ఎంతో శుభ్రంగా ఉంటే ఇక ఒక్క చిరునవ్వుతో ఎంతో మంది మనుషులను కూడా గెలిచేయొచ్చు.  ఇక దంతాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా బలంగా ఉంచుకోవడానికి డెంటిస్ట్ దగ్గరికి తరచూ చెకింగ్ కు వెళుతూ ఉండటం కూడా ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తుంటారు.



 అయితే ఎంతో మంది దంతాలు ఊడిపోవడం వంటి సమస్యలతో బాధపడుతుంటారు  కొంతమందికి వృద్ధాప్యంలో దంతాలు ఊడిపోతే.. మరికొంతమందిలో మాత్రం వివిధ సమస్యల కారణంగా దంతాలు ఊడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది  ఇలా దంతాలు కోల్పోవడం వల్ల కొంతమంది తమ లో కంటి చూపు మందగించింది అని చెబుతూ ఉంటారు. మరి కొంతమంది దంతాలను కోల్పోవడం వల్ల తమలో మతిమరుపు ఎక్కువైంది అని చెబుతూ ఉంటారు.  అదేంటి దంతాలను కోల్పోవడం వల్ల  మతిమరుపు ఎక్కువవ్వటం.. ఇలా కూడా జరుగుతుందా అని మరికొంతమంది అయోమయంలో పడి పోతూ ఉంటారు.



 అయితే తాజాగా దీనిపై అటు వైద్య నిపుణులు అసలు విషయాన్ని స్పష్టం చేశారు. దంతాలు ఊడిపోవడం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి అన్న విషయంలో ఇటీవల అమెరికా శాస్త్రవేత్తలు సరికొత్త అధ్యయనాన్ని చేపట్టారు. ఇటీవల నిర్వహించిన పరిశోధనల్లో దంతాలకు జ్ఞాపకశక్తికి లింక్ ఉంటుంది అని చెబుతున్నారు. దంతాలు తొందరగా ఊడిపోవటం మొదలైన వ్యక్తికి చిత్తవైకల్యం వస్తుంది అని చెబుతున్నారు వైద్యనిపుణులు. చిత్తవైకల్యం అనేది ఒక వ్యాధి ఈ వ్యాధి బారిన పడిన వ్యక్తి లో  క్రమక్రమంగా మతిమరుపు పెరిగిపోవడం ఆలోచన శక్తి తగ్గిపోవడం లాంటివి జరుగుతాయట. ఇలా దంతాలు కోల్పోయే వ్యక్తుల్లో జ్ఞాపకశక్తి తగ్గుతుంది అనే విషయాన్ని ఇటీవల జరిగిన అధ్యయనంలో గుర్తించినట్లు అమెరికా శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: