సాధారణంగా మన శరీరంలో అన్ని అవయవాలు దానిత వాటి ప్రత్యేకతలు కనబరుస్తూ ఉంటాయి.కానీ గోర్లు మరియు వెంట్రుకలను ఆ జీవ కణాలు అంటారు కానీ.. గోర్లు మరియు వెంట్రుకలు మన ఆరోగ్యం పైన ఆధారపడి ఉంటాయని చాలామందికి తెలియదు. ఒక్కొక్కసారి మన గోర్లు మన శరీరంలో ఉన్న కొన్ని రకాల అనారోగ్య సమస్యలను మనకు తెలియకుండానే వ్యక్తపరుస్తూ ఉంటాయి.కానీ మనం వాటిని అవగాహన లోపంతో తేలికగా తీసుకుంటూ ఉంటాము.అవి ఆ రోగాలు కాస్త కుదిరితే కానీ మనకి అర్థమవదు.అలాంటి కోవలోనే లివర్ సమస్యలు ఉన్నాయని గోర్లు ముందుగానే కొన్ని లక్షల లను కనబరుస్తూ ఉంటుంది అవేంటంటే..

గోర్లు బలహీనంగా తయారవడం..

మన శరీరంలో కాలేయం దెబ్బతిన్నప్పుడు గోర్లు బలహీనంగా తయారవుతూ ఉంటాయి.దీనికి కారణం మన లివర్ మనం తిన్న ఆహారం నుంచి కాల్షియంను సరిగా శోషణ చేసుకోదు.ఎందుకంటే మన గోర్ల ఆరోగ్యం క్యాల్షియం,బీటా కెరొటీన్ మీదే ఆధారపడి ఉంటుంది.

లివర్ సమస్యలు అధికంగా ఉన్నప్పుడు గోర్లకు సరైన రక్త సరఫరా కూడా జరగదు.అలాంటప్పుడు కూడా బలహీనంగా లేకుంటే ఏదైనా తగిలినప్పుడు వెంటనే విరిగిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి.

లివర్ డ్యామేజ్ వల్ల గోర్లపై పసుపు మరియు ఆకుపచ్చ చారలు కనబరుస్తాయి.ఇలాంటి సమయంలో  లివర్ పరీక్షలు చేసుకోవడం చాలా మంచిది.లివర్ డ్యామేజ్ వల్ల శరీరం బలహీనంగా,నిర్జీవంగా,పాలిపోయినట్టు తయారవుతుంది.

లివర్ సమస్యలతో పాటు ఇతర రోగాలను కూడా గోర్లు ముందస్తు రోగాలను కనబరుస్తూ ఉంటుంది.అందులో ముఖ్యంగా సాధారణ కంటే నెమ్మదిగా పెరగడం,పేలుసుగా ఉండి వెంటనే విరిగిపోవడం, గొర్ల నుంచి కుళ్ళిన వాసన రావడం,వంగినట్టు పెరగడం,నలుపు లేదా ఆకుపచ్చగా ఉండటం వంటి లక్షణాలను కనబరుస్తుంది.ఇలాంటి లక్షణాలు ఊపిరితిత్తుల వ్యాధి,రక్త హీనత,ప్లూరల్ ఎఫ్యూషన్‌లు, లింఫెడెమా,క్రానిక్ బ్రోన్కైటిస్,రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆటో ఇమ్యూన్ వ్యాధులు మరియు సైనసైటిస్ వంటి రోగాలకు ప్రతీకగా భావించాలి.

కావున మీ గోర్లు పెరగడంలో ఇలాంటి సమస్యలు కనబరుస్తూ ఉంటే,వెంటనే వైద్యాన్ని సలహా తీసుకోవడం చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: