
పెసరలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉండడం వల్ల ఇది మలబద్ధక సమస్యను ఇతర జీర్ణ సమస్యలను సైతం నివారించడానికి ఉపయోగపడుతుంది.. ఫైబర్ మలం పరిమాణాన్ని కూడా పెంచుతుంది అలాగే వాటి కదలికలను కూడా సులభంగా చేస్తుందట.
మధుమేహం నియంత్రణలో ఉపయోగించడానికి ఈ పెసరపప్పును ఉపయోగిస్తారు. ఇందులో ఉండే గ్లైసోమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉండటం వల్ల ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను పెరగకుండా చేస్తుంది.
పెసరలో ఫైబర్ పొటాషియం వంటివి ఎక్కువగా ఉండటం వల్ల రక్తపోటు నియంత్రణ చేయడానికి సహాయపడుతుంది.
పెసరల ప్రోటీన్ ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల ఇది తిన్నప్పటికీ కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది. అందుకే అతిగా తినకుండా ఉండేలా సహాయపడుతుంది.
పెసరలో ఉండేటువంటి విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు జలుబు ఫ్లూ వంటి వ్యాధులను కూడా రాకుండా చేస్తాది.
పెసరలో విటమిన్-c ఉండడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల ఇది చర్మాన్ని ఆరోగ్యంగా యవ్వనంగా ఉంచేలా సహాయపడతాయి.
ఇందులో ప్రోటీన్ ఐరన్ వంటివి పుష్కలంగా ఉండడం వల్ల శరీరానికి బలం అందించడమే కాకుండా జుట్టుకు కూడా బలంగా దృఢంగా పెరిగేలా సహాయపడతాయి.
ఈ పెసరపప్పును ఉడికించి అయిన లేకపోతే సాంబారులోనైనా మొలకెత్తించిన గింజలను సలాడ్ ద్వారా ఏ రకంగా తిన్నా కూడా వీటివల్ల మనకి లాభాలే ఉంటాయి. ముఖ్యంగా పెసరట్టు పెసరపప్పు వంటివి కూడా చేసుకోవచ్చు.