చాలామందికి మద్యం అలవాటు అనేది ఉంటుంది. కొంతమంది విపరీతంగా మద్యం సేవిస్తూ ఉంటారు. ఇక ఒకప్పుడు మద్యపానాన్ని ఎక్కువగా మగవాళ్లు మాత్రమే తాగేవారు. కానీ ఇప్పుడు చాలామంది ఆడవాళ్లు కూడా మద్యపానాన్ని సేవిస్తూ ఉన్నారు.. ఏదైనా పార్టీలు, పండగలు వంటివి జరిగినప్పుడు కచ్చితంగా అందులో మద్యం ఉండాల్సిందే. ఇక ఈ పార్టీలు పండగలలో ఆడ మగ తేడా తెలియకుండా మద్యం సేవిస్తూ ఉన్నారు. కానీ ఇలా మద్యం తాగితే అస్సలు మంచిది కాదట.ఎంత మద్యం సేవిస్తే అంత మన ఆయుష్షు తగ్గిపోతుందట. మరి ఇంతకీ మద్యం ఎంత తాగితే ఆయుష్షు తగ్గిపోతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. మద్యపానాన్ని ఎక్కువగా సేవిస్తే లివర్ పాడవుతుందని అంటూ ఉంటారు డాక్టర్స్. 

ఇక ఆ తీవ్రత మరీ ఎక్కువైతే శరీరంలో ఉన్న అవయవాలన్నీ పాడయ్యి చివరికి ఆ మనిషి చనిపోయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు.అయితే మద్యం ఎక్కువ తాగడం కాదు తక్కువ తాగినా కూడా ఆయుష్షు తగ్గుతుంది అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇక అసలు విషయం ఏమిటంటే.. తాజాగా జర్నల్ ఆఫ్ స్టడీస్ ఆల్కహాల్ అండ్ డ్రగ్స్ లో ప్రచురితమైన అధ్యయనంలో తేలింది ఏంటంటే.. తక్కువ మందు తాగిన వారిలో కూడా ఆయుర్దాయం తగ్గుతుందట. అంతేకాదు ఈ మద్యపానం తాగడం వల్ల తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుందని వాళ్ళు పేర్కొన్నారు..

 డాక్టర్ టీం స్టాక్ వెల్ ప్రకారం చూస్తే..రోజుకు ఒకసారి మద్యం సేవిస్తే వాళ్ళ జీవితంలో రెండున్నర నెలల ఆయుర్దాయం తగ్గుతుందట. అలాగే వారానికి రెండుసార్లు మద్యపానం సేవిస్తే వారి జీవితంలో మూడు నుంచి ఆరు రోజుల ఆయుర్దాయం తగ్గుతుందట. ఇక ఒక వారంలో 35 సార్లు మద్యపానం సేవిస్తే ఆ మనిషి సగటు జీవితంలో దాదాపు రెండు సంవత్సరాల ఆయుర్దాయం తగ్గుతుందని ఈ అధ్యాయనంలో తేలింది.అలా మద్యపానం ఎక్కువ తాగడమే కాదు తక్కువ తాగినా కూడా మనిషి జీవితంలో ఆయుర్దాయం తగ్గడమే కాదు తీవ్రమైన వ్యాధులకు కారణం అవుతుంది అంటూ డాక్టర్లు తేల్చేశారు. అలా ఏ విధంగా చూసినా ఆల్కహాల్ వల్ల అన్ని అనర్ధాలే ఉన్నాయని  తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: