
ఎప్పుడన్నా పసి పిల్లల్ని ఎత్తుకుని పైకి ఎగరేస్తూ ఆడటం లాంటివి చేసారా.. !! అలా గాల్లోకి ఎగరేసినపుడు ఆ బుజ్జాయి పెదవుల మీద ఉండే నవ్వు చూస్తే చాలు ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంటుంది. అలా నవ్వడం అనేది బుజ్జాయికి ఆరోగ్యం అంట. అలాగే ఒళ్లో కూర్చో పెట్టుకుని లాలిపాట పాడుతూ ముందుకీ వెనక్కి ఊపుతూ ఆడించటం, వంటి వన్నీ పిల్లలకి కేవలం ఆటలగా సరదాగా అనిపిస్తాయి. కానీ, నిజానికి బిడ్డల్ని అలా అటూ, ఇటూ ఊపుతుండటం వల్ల ఎంతో లాభం ఉందని గుర్తించారు పరిశోధకులు. వీటివల్ల వారి మెదడులో గణనీయమైన పెరుగుదల ఉంటుందని గుర్తించారు కూడా.
బిడ్డలకు సంగీతాన్ని వినిపిస్తూ ఇలా లయబద్ధంగా ఊపటం వల్ల వారి మెదడులో" సెన్సరీ వ్యవస్థ" చక్కగా మెరుగుపడుతుంది. దీనివల్ల నాడీకణాల మధ్య అనుసంధాయక సంబంధాలు అంటే న్యూరాల్ నెట్వర్క్స్ మెరుగై, మెదడు మరింత చురుగ్గా అభివృద్ధి చెందుతోందని పరిశోధకులు గుర్తించారు.తెలిసో తెలియక మనం చేసే ఈ పని వల్ల పాపాయి మెదడు అభివృద్ధి చెందుతుంది.చిట్టి పొట్టి గీతాలు, పాటలు పిల్లలకి చిన్నితనం నుంచే వినిపిస్తుండటం వల్ల వారిలో రకరకాల సామర్ధ్యాలు చురుకుగా అభివృద్ధి చెందుతాయి.