పోషకాహారలోపం అనేది సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోవడం వల్ల కలుగవచ్చు. లేదా కొన్ని వ్యాధుల కారణంగా కాని, కొన్ని సమయాల్లో శరీరానికి అధికంగా పోషకాలు అవసరమైనపుడు కాని, లేదా పోషకాలను సరిగ్గా జీర్ణం చేసుకోలేనప్పుడు కాని , అన్నవాహికనుంచి రక్తంలోకి పోషకాల శోషణ సక్రమంగా జరుగనపపడు కాని సంభవించవచ్చు.పోషకాహార లోపం, మానసిక సమస్యలు పోషకాహార లోపాన్ని పరస్పరం ఉధృతం చేసుకుంటాయి. సహజంగానే బుద్ధిమాంద్యత కలిగిన వారు పోషకాహారలోపంతో బాధపడే అవకాశాలు ఎక్కువ.
వీరి మానసిక సమస్య కొంత ఈ లోపానికి దారి తీస్తోంది. మానసిక సమస్య కారణంగా వారికి ఆహారంపై శ్రద్ధ ఉండకపోవడం దీనికి కారణం. పోషకాహార లోపం ఉన్న పిల్లలకు అరటిపండ్లు, వేరు సెనగలు, సెనగలు వంటి బలవర్ధక ఆహారం ఇవ్వటం వల్ల వారి పేగుల్లో మంచి బ్యాక్టీరియా మెరుగుపడుతుందని, ఇది వారి ఎదుగుదల మొదలవటానికి దోహదపడుతుందని తాజా పరిశోధన చెప్తోంది. ఈ ఆహారం అందించటం వల్ల పిల్లల్లో ఎముకలు, మెదడు, శరీరం ఎదుగుదల ఉండటానికి ఎక్కువ అవకాశం ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి