ఇక యువకులు, టీనేజీ పిల్లలు పరిమితికి మించి సౌండ్ పెట్టుకొని ఆడియో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపారు. అయితే వరల్డ్ పబ్లిక్ హెల్త్ రిపోర్ట్ ప్రకారం 70 డెసిబెల్స్కు మించి సౌండ్తో ఆడియో వినకూడదన్నారు. ఇక అలా చేస్తే భవిష్యత్తులో వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాక.. చాలా మంది పిల్లలు, టీనేజీ యువత 85 డెసిబెల్స్తో ఆడియో వింటున్నట్లు తెలిపారు. అయితే ఇది అత్యంత ప్రమాదకరమని అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ ది క్వైట్ మెంబర్ డేనియల్ ఫింక్ వెల్లడించారు.
అయితే ఒక రోజులో గంటకు పైగా 85 డెసిబెల్స్ను మించి ఆడియో వినే పిల్లలు, టీనేజీ యువకుల్లో వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు. అంతేకాదు.. 85 డెసిబెల్స్ సురక్షితం అని ఇటీవల వాల్ స్ట్రీట్ జర్నల్ కథనాన్ని తప్పుబడుతూ, ఇది ఎవరికీ సురక్షితమైన ఎక్స్పోజర్ కాదని ఆయన స్పష్టంగా తెలియజేశారు. అంతేకాదు.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ 85 డిబిఎ సౌండ్ ఎక్స్పోజర్ లెవల్ను సిఫార్సు చేసినట్లు వాల్స్ట్రీట్ కథనం ఇటీవల వెల్లడించారు.
అంతేకాదు.. 70 డెసిబెల్స్ కంటే ఎక్కువ సౌండ్ పిల్లలు, యువకులకు అంత సరక్షితం కాదని ఆయన వెల్లడించారు. ఇక ఫ్యాక్టరీలో శబ్ధాల మధ్య పనిచేసే కార్మికులు, లేదా భారీ పరికరాల ఆపరేటర్లకు 85 డెసిబెల్స్ సౌండ్ వరకు ఎటువంటి ప్రమాదం లేదని అన్నారు. ఇక ఈ ప్రమాదం చిన్నపిల్లల్లోనే ఎక్కువగా ఉంటుందని ఆయన తెలిపారు.
కాగా.. ఏదేమైనా, పిల్లల చెవులు జీవితకాలం పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇక వినికిడి నష్టం కారణంగా కమ్యూనికేషన్లో ఇబ్బందులు, సామాజిక ఒంటరితనం, ప్రమాదాలు జరిగే అవకాశం, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నట్లు చెప్పారు. దీనిని నివారించాలంటే పరిమితికి మించి ఆడియో సౌండ్ వినకూడదని ఆయన స్పష్టంగా వెల్లడించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి