సమాజంలో అసమానతలు తగ్గించడానికి ప్రపంచం ప్రయత్నాలు చేసుకుపోతుంది. కానీ మరో పక్క ఇస్లాం పేరుతో ఈ అసమానతలు మరింతగా పెరిగిపోతున్నాయి. అందరికి స్వేచ్ఛ అని ప్రపంచం ప్రచారం చేస్తుంటే, ఇస్లాం అతివాదం మాత్రం దానికి విరుద్ధంగా ప్రయత్నాలు చేసుకుంటూపోతుంది. మహిళల స్వేచ్ఛ, సమానత్వం, ఆర్థికాభివృద్ధి కి ప్రయత్నాలు చేస్తుంది ఐక్యరాజ్య సమితి కూడా. కానీ తాజా ఆఫ్ఘన్ అక్రమణతో ప్రపంచంలోని ఇస్లాం దేశాలలో అతివాద భావాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. తాలిబన్ ల నుండి ఈ భావాలు పాక్ కు, అటునుండి ఇరాన్ కు పాకాయి ఈ భావాలు. అందుకే ఆయా దేశాలలో ఇప్పటికే మహిళలపై అనేక ఆంక్షలు పెడుతున్నారు. అంటే దాదాపు ఆయా దేశాలలో మహిళలు కేవలం వంటింటికే పరిమితం చేస్తున్నారు.

ప్రపంచానికి ఇదో సవాలుగా తయారవుతుంది. ఆయా దేశాలలో ఉన్న ఇస్లాం ఇటువైపు మళ్లితే అప్పుడు పరిస్థితి ఏవిధంగా సమస్యలు తెస్తుంది అనేది అందరు ఆలోచిస్తున్నారు. ఒకవేళ ప్రపంచంలోని ఇస్లాం మొత్తం తమ పంధాలో లేదనే భావాలను తాలిబన్ లు భరించలేకపోతే వాళ్ళు తాజాగా కాబుల్ లో తమవారిపైనే తెగబడినట్టి పరిస్థితులు ప్రపంచం మొత్తం పరిణమిస్తే అనేది ఆలోచించదగ్గ విషయం. దీనిపై కనీస చర్చ నేడు ప్రపంచం చేయాల్సి ఉంది. లేదంటే ఈ అతివాదం భవిష్యత్తరాలకు వారి బాటపై అస్పష్టత ఇస్తుంది. దానితో వాళ్ళు ఎవరు సరైన వారు అనే నిర్ణయం తీసుకొనేలోపు వారిని తమవైపు తిప్పుకునేంత పని తాలిబన్ లాంటి విషపూరిత సంస్థలు ప్రయత్నిస్తే యువత తప్పుడు అడుగులు వేసే అవకాశం చాల ఎక్కువగా ఉంటుంది.

మహిళలు-పురుషులు అనే మీమాంశ ఇప్పటి సాంకేతిక సమాజంలో అవసరం లేదని అందరు తెలుసుకోవాలి. ఆయా విజ్ఞానాన్ని వారికి అందించాల్సి వచ్చినా ఆయా దేశాలు అందుకు కూడా కృషి చేయాల్సి ఉంటుంది. లేకపోతే దేశానికి విలువైన సంపదగా గుర్తింపు పొందిన యువత నిర్వీర్యం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నేటి యువతకు ప్రపంచం స్పష్టంగా లింగభేదాలు లేవని అందరు సమానమేనని చెప్పాల్సిన సందర్భం వచ్చేసింది. దానికి అందరు సన్నద్ధం కావాల్సి ఉంది. మన ఇంట్లో అలాంటి వాతారణం లేకపోయినా ఇంట్లోనే అతివాదం చాపకింద నీరులా వ్యాపించినా ఆశ్చర్యపోనవసరం లేదు. అందరు సమానులే. పరిస్థితులను బట్టి ఒకరు ఎక్కువ, తక్కువ అని అనిపించవచ్చు కానీ, నిజానికి అందరు సమానమే.

మరింత సమాచారం తెలుసుకోండి: