మనిషి జీవితంలో ఫోన్ అనేది ఎప్పటి నుంచి ప్రారంభమైంది అని ఎవర్నైనా అడిగితే వారు ఏం చెబుతారు. మహా అంటే ఓ 30 ఏళ్ల క్రితమో లేకుంటే 40 ఏళ్ల క్రితమో వచ్చిందని చెబుతారు. మొట్టమొదటిసారిగా టెలిఫోన్ కనుగొన్నది గ్రాహంబెల్ అని అందరికీ తెలిసిన విషయమే. అదీ కూడా 1876లో ఆయన తొలిసారి కనుగొన్నారు. కాని ఇప్పుడు 800 ఏళ్ల క్రితం ఫోన్, తవ్వకాల్లో బయటకొచ్చింది.వినడానికి చోద్యంగా ఉన్నా ఇది నిజం.మీరే చూడండి..



ప్రపంచం మొత్తాన్ని గుప్పిట్లోకి తీసుకు వచ్చిన సెల్ ఫోన్లను 800 ఏళ్ల క్రితమే వినియోగించారంటే నమ్మగలరా? ఆర్కియాల జిస్టుల తవ్వకాల్లో బయటపడిన ఆధారాలను చూస్తే, నమ్మక తప్పని పరిస్థితి...ఆస్ట్రియా దేశంలో ఆర్కియాలజిస్టులు మొబైల్ ఫోన్ఆకారంలో ఉన్న ఒకమట్టి నమూనాను కనుగొన్నారు.దీనిపై సెల్ ఫోన్ మీద నంబర్లలా సుమేరియన్ అక్షరాలు ఉన్నాయి. అంతేకాదు..డయల్, బ్యాక్,మెనూ కీస్ లాంటి ఏర్పాట్లు కూడా కనిపిస్తున్నాయి.సెల్ ఫోన్ల ప్రారంభదశలో మార్కెట్లోకి వచ్చిన మోడల్ రూపంలో ఈ నమూనా ఉంది..ఆర్కియాలజిస్టులు కనుగొన్న మట్టి నమూనాపై  మెసపుటేమియాలో క్రీస్తూ పూర్వ 3500 నుంచి 3 వేల సంవ్సరాల మధ్య సుమేరియన్లు అభివృద్ధి చేసిన లిపిలో ఈ అక్షరాలు ఉన్నాయి...మరోవైపు, ఇది ఏలియన్స్ కి చెందినది అయి ఉండవచ్చని కొందరు చెబుతున్నారు.వారు పోతూ పోతూ జారిపడేసి ఉండవచ్చని మరి కొంతమంది సిద్ధాంతకర్తల వాదన...



అదీ గాక ఈ మొబైల్ కి ఇప్పటి మొబైల్ ఫోన్స్ కి అతి దగ్గర పోలిక ఉంది. దీనిని కనుగొన్న శాస్త్రవేత్తలు ఇది 13 వ శతాబ్దానికి చెందినది గా గుర్తించారు.మొదట్లో వచ్చిన మొబైల్స్ కి అచ్చుగుద్దినట్లు కీబోర్డు ఉండడంతో ఇది ఎక్కడి నుండి వచ్చిందో, ఎవరికి సంబంధించిందో అని పురాతత్వ శాస్త్రవేత్తలు తలలు పట్టుకొంటున్నారు. ఆ కీబోర్డ్ మీద ఉన్న అక్షరాలు ఇరాక్, ఇరాన్ బాషకు సంబంధించినదిగా భావిస్తున్నారు....గ్రహాంతరవాసుల పరిశోధనా శాస్త్రవేత్త అయిన డానియల్ మునోజ్ బయటపడ్డ శిలాజానికి మన మొబైల్ ఫోన్ కి గల సారూప్యతను తెలిపాడు.ఈ వస్తువులు మనకంటే ముందున్న వ్యక్తులవని ఆయన అభివర్ణించాడు..



ఆస్ట్రియాలోని సాల్జ్ బర్గ్ ప్రాంతంలో ఈ వస్తువు దొరికింది..ఆ ప్రదేశంలో ప్రస్తుతం మరింతగా తవ్వకాలు జరుగుతున్నాయి. ఇంకా ఏమైనా దొరికే అవకాశం ఉందేమోనని అక్కడ,తవ్వకాలు మరింత వేగవంతం చేస్తున్నారు.. కానీ ఇది ఎప్పుడు ఎక్కడి నుండి వచ్చిందో ఆయన సరిగా చెప్పలేకపోయాడు. ఈ వస్తువు ఏమిటనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే అంతేకాకుండా నిజమైన సెల్ ఫోన్ అవునో కాదో ఇంకా తెలియాల్సి ఉంది..ఈ మట్టి ఆకృతి ఏమిటన్నది ఇప్పటికీ తెలియనప్పటికీ, దీని వెనుక ఆసక్తికర అంశాలు దాగి ఉండవచ్చని, వాటిని కనుగొనే ప్రయత్నం చేస్తున్నామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు....

మరింత సమాచారం తెలుసుకోండి: