జీవితంలో దేనికోసం ఎదురు చూడకు. ఎదురు చూడడం అంటే జీవితాన్ని, విలువైన సమయాన్ని వృధా చేయడమే.  సంతోషం రెండు కష్టాల మధ్య వచ్చే ఉపశమనం కాదు. అది కష్టపడి సంపాదించుకునే హృదయ సంస్కారం. మితిమించిన కోపం, సంతోషం, గర్వం, అసంతృప్తి, తానే గొప్పవాడినన్న అహం.. ఇలాంటివన్నీ లేనివాడే ఉత్తమ పురుషుడు. వివేకవంతుడు తాను ఏమి ఆలోచిస్తున్నాననే విషయాన్ని ఎవ్వరికీ తెలియనివ్వడు. తాను చేస్తున్న పని మాత్రమే ఇతరులకు తెలిసేటట్లుగా చేస్తాడు. అలాదే తాను ఓ పనికి ఉపక్రమించినప్పుడు ఎండావాన, ఇష్టాయిష్టాలను ఏమాత్రం లెక్కచేయడు.

 

– సౌకర్యాలు పెరిగాయి, సదుపాయాలు పెరిగాయి, సౌఖ్యాలు పెరిగాయి. సంతోషమే సన్నగిల్లి పోయింది.


– ఒకరు మనపై జాలి పడడం మనకు గౌరవం కాదు. సానుభూతులు, సహాయాలతో జీవితం నిండదు. మనం మనంగా ఉన్నప్పుడే పదిమందిలో గౌరవం.


– ఇతరులతో నిన్ను పోల్చుకోవాలని చూడవద్దు. పోలిక విషం లాంటిది. వృద్ధిపై బుద్ధి పోనివ్వకుండా అడ్డుకునే దుర్మార్గపు లక్షణం పోలికలో ఉంటుంది.


-ప్రపంచం మారదు, మారాల్సింది నువ్వే.


– ప్రేమించడం వేరు, ఒక వస్తువు కావాలనుకోవడం వేరు. కావాలనుకున్న ప్రేమ స్వార్థం అవుతుంది, అది బాధను మిగులుస్తుంది.


– ధ్యానం అంటే మన ఆలోచనలు, ప్రతిక్రియలు, ఉద్వేగాలు, ఉద్రేకాలు, ఆవేశాలు. వీటి స్వరూప స్వభావాలను, తత్త్వాలను అర్థం చేసుకుని అదుపు చేస్తేనే ధ్యానం సార్థకమవుతుంది.


– ఒకరివద్ద ఉన్నదేదో నీ వద్ద లేదు. అంటే నీ దగ్గర ఏదో లేదని కాదు, వాడి దగ్గర ఉంది కనుక నీకేదో లేదు అనిపిస్తోంది. ఇది కేవలం భావదారిద్య్రం మాత్రమే. ఉన్నదేదో ఉంది అని ఉన్నంతలో సరిపెట్టుకుంటే అంతకు మించిన ఆనందం లేదు.


– ఈ ప్రపంచానికి పెద్ద మార్పు అవసరం అని నువ్వు అనుకుంటే ఆ మార్పు ఎక్కడి నుంచో రెక్కలు కట్టుకుని రాదు, నువ్వు మారితే ప్రపంచం దానంతట అదే మారుతుంది. కనుక మార్పు నీ నుంచే మొదలవ్వాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: