ఫ‌స్ట్ కాజ్ : రేలా రే రేలా జాన‌కీ రావు బృంద గానం విన్నాక

 

వాన‌ల‌న్నీ  మేలు చేశాయా? మేలు చేసే వాన‌లు లేకున్నా మేలు చేసే మ‌నుషులు మిగిలి ఉన్నార‌న్న సంతోషం ఒక‌టి త‌ప్ప‌క క దిలిస్తుంది. వానా, వాగూ ఆగ‌మాగం చేశాక వ‌చ్చిన ప్ర‌శాంత‌త‌ను మ‌నం అందుకోవ‌డం సాధ్యం చేసుకోవాలి. బుజ్జాయిల న‌వ్వుల చెంత ఆ ప్ర‌శాంత‌త ఆ ఆనంద వ‌ద‌నం ఉంద‌ని గుర్తించాలి. ఇప్పుడూ ఎప్పుడూ మంచి కోరే ప్ర‌య‌త్నాలు కొన్ని మ‌న సాహిత్యం చేస్తోంది. గుర్తించ‌డంలో వెనుక‌బాటు ఉంటే నేనేం చేయ‌ను. మంచి కాలాలు వ‌చ్చే వేళ‌ను వేడుక అని అంటారే! అలాంటి వేడుక‌ల కు పోయాను. ఆనందించేను నేను.  
ద‌గ్గ‌ర‌లో తుఫానులే ఉన్నాయి
చేరువ‌లో వాన‌లే ఉన్నాయి
అకాల వాన అకార‌ణ వాన
ఎలా ఉన్నా కొన్ని మాత్రం
నిన్న‌టి బాధ‌ల నుంచి ఉప‌శ‌మ‌నంగానే ఉంటాయి
అలాంటి పాట .. అలాంటి న‌డ‌వ‌డి ఒక‌టి మ‌న  జీవితాల‌ను క‌దిలిస్తుంది.

క‌ళ‌ను మాత్ర‌మే న‌మ్ముకున్న కుటుంబాలు గ‌జ‌ప‌తి న‌గ‌రం నుంచి వ‌చ్చాయి. లేదా ఆ రాజాం దారుల నుంచి వ‌చ్చాయి. జాన‌కీ రావు ఎన్నో ఏళ్లుగా నాతో ఉన్నాడు. నా జీవితంలో ఉన్నాడు. జాన‌కీ రావు మంచి పాట నేర్చుకుని పాడే క్ర‌మంలో ముందున్నా డు. కొన్ని చైత‌న్య గీతాలు ఆలాప‌న లో నాతో ఉన్నాడు. ఆయ‌న‌తో పాటు నా త‌మ్ముడు శివ‌గాడు, తిరుప‌తి, మ‌రో మంచి త‌మ్ము డు శివ‌గాడు ఉన్నాడు. పాట‌తోనే త‌మ కుటుంబాల‌ను పోషించుకుంటున్న ఈ కుర్రాళ్లు ఎంతో ప‌ద్ధ‌తిగా ఉంటారు. ఉద్య‌మ పాట లు నేర్చుకోండి అని అంటాను. త‌ప్ప‌కుండా స‌ర్ అని అంటారు. పాట రాశాక జానకీతో మాట్లాడ‌తాను. అప్ప‌టిక‌ప్పుడు అనుకు న్న స్వ‌ర‌మేదో చెబుతాను. వాటిని ఇంప్ర‌వైజ్ చేస్తే పాట‌. ఇలా ఎన్నో! మా దారుల్లో కొత్త నినాదాలు వికసిస్తాయి. నిన్న‌టి వేళ డా క్ట‌ర్ ద‌న్నాన ప్ర‌వీణ్ స‌ర్ ఇంటి వేడుకకు వ‌చ్చారు వీళ్లు. ఎంతో బాగా పాడారు. ఆనందించేను నేను ఆనందించాలి మీరు. పాట గ‌మ‌న రీతుల్లో ఇంకొన్ని మార్పులు రావాలి అని చెప్పాను. సినిమా పాట మా పాట వేరు కాదు మా పాట‌ను వాడు వాడుకుని మ‌మ్మ‌ల్ని ఒంట‌రిని చేస్తున్నాడు అని కూడా చెప్పాను. నాతో పాటు వైసీపీ యువ నాయ‌కులు మెంటాడ వెంక‌ట స్వ‌రూప్ స‌ర్, నాతో పాటు చిన్నీ అన్న‌య్య, నాతో పాటు మీడియా జేఏసీ చైర్మ‌న్ శాస‌పు జోగినాయుడు. మేం అంతా మంచి పాట రాకను మంచి వాన రాక‌ను ఆహ్వానించే స్నేహితులం. జాన‌కీ  రావు ఐ యామ్ విత్ యూ...


తుఫాను గాలులు కొన్ని ఆల‌స్యం అయి ఉన్నాయి లేదా తుఫాను గాలులు కొన్ని స‌మీపంలో ఉన్నాయి. తుఫాను ఏద‌యినా మా ఇంట కొన్ని  మార్పుల‌కు సంకేతం అయి ఉంటుంది. తుఫానును ఆహ్వానించిన తీరాలు కొన్ని మా జీవితాల‌ను మార్పు కోరుకోమ‌నే చెబుతాయి. మేం నినదిస్తాం అని అనుకుంటే ప్ర‌కృతే మా గొంతుక అవుతుంది. ప్ర‌కృతే మా అంద‌రి పాట అవుతుంది.  ప్రకృతే కొత్త సృజ‌నకు పూనిక వ‌హించి పంపుతుంది. అందుకే మా ప్ర‌కృతి మాకు ప్ర‌త్యేకం మా పాట మాకు అనంతం. అనంత ఛాయల చెంత ఒక స్వ‌ర రాగ స్ప‌ర్శ సాయం సంధ్య‌ల్లో పాట మా ఊరి పాట. మా ఊట మా తేట మా తెలుగు ఇలా అన్నీ అన్నీ మా  మా మా లు క‌లుపుకుని వ‌చ్చిన గ‌మ‌నం. సాయం సంధ్య‌లో ప‌చ్చ‌ని చెట్టు నీడ‌ల్లో పాట.. గ‌రిక చెంత పాట..గ‌రిమ పాట‌.. ప్రకృతిలో ఉన్న‌వన్నీ మ‌నిషిలోనే ఉన్నాయి కానీ ఉన్న‌వ‌న్నీ ర‌ద్ద‌యిపోయి ఉన్నాయి. క‌నుక పాట ఆ వెలికితీత‌ల‌కు కార‌ణం అయితే ఎంత బాగుండు.


కొన్ని మాత్ర‌మే మ‌నం అనుకున్నంత ఉన్న‌తీక‌ర‌ణకు నోచుకుని ఉంటాయి. మేం అల‌సి సొల‌సి రాసిన పాట‌ల‌లో ఉల్లాసం ఉత్సాహం  అన్న‌వి నేప‌థ్యాలు అయి ఉంటాయి. ఈ పాట తెలంగాణ దారుల్లో ఉంది. ఈ పాట సీమ తోవ‌ల్లో ఉంది. మేమంతా ఎల్ల‌లు దాటిన సాహిత్య సంగ‌మ క్షేత్రాల్లో ఉన్నామ‌ని స‌గ‌ర్వంగా చెప్పుకుంటాం. చెప్పానొక మాట.. అవ‌మానాలు దాటిన పాట‌ను సినిమా వాడుకుంటుంది అని! అవును ఇదే జ‌రుగుతోంది. కనీసం ఈ పాట‌కు మూలం ఫ‌లానా అని చెప్పేందుకు అడ్డొచ్చే సంస్కారాన్ని నేను ఛీత్క‌రించుకుంటూ పోతాను. ఇంకొన్ని మంచి పాట‌లు మ‌న సెలయేళ్ల‌లో ఉన్నాయి. కొన్ని మంచి పాట‌లు మా జీవిత నాదాల్లో ఉన్నాయి. వెళ్తూ వెళ్తూ కొన్ని న‌వ్వులు ఇచ్చి వెళ్లారు జానకీ మరియు శివ‌గాడు. కార్తీకాన వినిపించిన పాట‌లన్నీ కైవ‌ల్య సిద్ధినే ఇస్తాయి. గ‌మ‌న రీతుల్లో మ‌నం వెనుక‌బ‌డి పోయి ఎవ్వ‌రినో నిందించ‌డంలో సిస‌లు త‌ప్పు ఏదో తాగి ఉంది. తుఫానులు సంబంధిత హోరు గాలులు ఉన్న‌వ‌న్నీ ఇంకొన్ని త‌ప్పిదాల‌ను వెల్ల‌డి చేసేందుకే! పాట త‌ప్పిదాల‌ను స‌రిదిద్దే ప్ర‌కృతి.  క‌నుక ప్ర‌కృతి ప్రేమించి వికృతిని ద్వేషించ‌డ‌మే తక్ష‌ణ క‌ర్త‌వ్యం కావాలి.

- ర‌త్నకిశోర్ శంభుమ‌హంతి

రేలా లే రేలా జాన‌కీ రావు బృందంతో..

మరింత సమాచారం తెలుసుకోండి: