
చాక్లెట్ కు ప్రత్యామ్నాయంగా ఎండు ద్రాక్షను తినిపించవచ్చు.. ముఖ్యంగా ఇందులో కార్బోహైడ్రేట్లు, ఐరన్ పుష్కలంగా లభించడం వల్ల పిల్లలకు చాలా చక్కటి ఆరోగ్యకరమైన స్నాక్ గా పరిగణించవచ్చు.. ఎండు ద్రాక్షలో ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి.. కాబట్టి పెరిగే పిల్లలకు వీటిని ఇవ్వడం వల్ల వారి ఎదుగుదలకు మరింత తోడ్పడుతుంది. ఇక చిన్న పిల్లలకు సీజనల్ వ్యాధులు కూడా దూరం అవుతాయి. ఈ ఎండు ద్రాక్షలో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే మలబద్దకం వంటి సమస్యలు వచ్చినప్పుడు చాలా బాగా పనిచేస్తుంది. ఇక ఒక గ్లాసు నీటిలో కొన్ని ఎండు ద్రాక్షను నానబెట్టి మరుసటి రోజు ఉదయం పిల్లలకు వాటిని అందించడం వల్ల మంచిగా ఫైబర్ తో పాటు ఐరన్ కూడా లభిస్తుంది.
ఎండుద్రాక్ష ను తినిపించడం వల్ల రోగనిరోధక శక్తి బలోపేతం చేయడంతోపాటు జ్వరం బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ల వంటివి దూరం అవుతాయి.. చిన్న పిల్లలకు తినిపించడం వల్ల వారు ఏ విషయాన్ని అయినా సరే గుర్తుపెట్టుకునే శక్తి వారికి లభిస్తుంది. మెదడు చురుగ్గా పని చేయడమే కాకుండా మెదడు పెరుగుదల కూడా ఉంటుంది. 8 నెలల నుంచి పది నెలల వయసులో ఉన్న పసిపిల్లలకు తినిపించడం వల్ల పిల్లల ఎదుగుదల బాగా ఉంటుంది.. ఇక ఎండుద్రాక్షలు పిల్లలకు తినిపించే ముందు వాటిని బాగా గుజ్జు చేసి తినిపించడం వల్ల అన్ని పోషకాలు లభిస్తాయి..