బొప్పాయి పోషకాల గని అని అందరికీ తెలిసిందే.ఈ పండు రుచికే కాక ఆరోగ్యానికి, అందానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. బొప్పాయి మొక్కలలో ప్రతి భాగము అనేక పోషకాలు కలిగినవే. కానీ చాలా మంది బొప్పాయి తిని, విత్తనాలు పడేస్తూ ఉంటారు. కానీ విత్తనాలలో ఉండే పోషకాలు గురించి తెలిస్తే, అసలు అలా చేయరు. అలాంటి బొప్పాయి గింజల వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..

బొప్పాయి గింజల్లోని పోషకాలు..
బొప్పాయి గింజలు చూడటానికి మరియు తినడానికి కూడా మిరియాల మాదిరిగా ఉంటాయి.100grms  బొప్పాయి గింజలలో 558 క్యాలరీల శక్తి లభిస్తుంది. మరియు ఇందులో విటమిన్ ఏ,సి, ఐరన్,కాల్షియం మెగ్నీషియం,ఫాస్ఫరస్,జింక్ మొదలగునవి పుష్కలంగా లభిస్తాయి.  అంతేకాక మోనోసాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్,ఫాలిఫినాల్స్ మరియు ప్లవనాయిడ్స్ అనే ఆంటీయాక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.

బొప్పాయి గింజలు వల్ల ఉపయోగాలు..
క్యాన్సర్ నిరోధకారిణిగా..
బొప్పాయి గింజలలోని పాలిపినాల్స్ అనే యాంటిఆక్సిడెంట్ లు అధికంగా ఉండటం వల్ల, క్యాన్సర్ ను కలిగించే ప్రీ రేడికల్స్ తో పోరాడి,క్యాన్సర్ రాకుండా నిరోదిస్తుంది.ఇందులోని ఐసోతీయసయనేట్ గుణాలు, క్యాన్సర్ కణాలను నశింపచేస్తుంది.

కిడ్నీ పనితీరు మెరుగుపర్చడానికి..
బొప్పాయి గింజలను ఎండబెట్టి పొడి గా చేసి భద్రపర్చుకోవాలి.ఈ పొడిని రోజూ ఏదొక రూపంలో తీసుకోవడం వల్ల, మనం తీసుకున్న ఆహారం ఈజీగా జీర్ణం అయి,కిడ్నీపై పని భారం తగ్గేలా చేస్తుంది.

గుండె సంబంధిత రోగాలు రాకుండా కాపాడటానికి..
బొప్పాయి గింజలను తరుచూ తీసుకోవడం వల్ల ,ఇందులోని యాంటి ఆక్సిడెంట్లు గుండె చుట్టూ వున్న చెడుకొలెస్ట్రాల్ కరిగించడం లో సహాయపడతాయి.మరియు రక్తనాళాల్లో రక్తం సక్రమంగా సరఫరా జరిగేలా సహాయపడతాయి.

యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు..
 బొప్పాయి గింజ లలో  విటమిన్ సి,ఆల్కలాయిడ్ వంటింట్లో మేటరి ఆంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు,గౌట్ మరియు ఆర్థరైటిస్ వంటి వ్యాధులు దరిచేరకుండా సహాయపడతాయి.

 వృద్ధాప్య ఛాయలు నిరోధించడానికి..

ఎంత వయసు పెరిగిన, ముడతలు, చారలు వంటి వృద్ధాప్య ఛాయలు రాకుండా కాపాడటానికి, బొప్పాయి గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: