అయితే ఒక్కసారి మొసలి నోట్లో చిక్కారు అంటే.. ఇక ప్రాణాలతో బయటపడటం అసాధ్యం. ఎంతటి జంతువునైనా సరే ఆహారంగా మార్చుకుంటూ ఉంటుంది మొసలి. అదే నీటిలో అయితే మొసలి మరింత బలాన్ని కలిగి ఉంటుంది అని చెప్పాలి. కానీ అలాంటి ప్రమాదకరమైన మొసలి నోట్లోకి వెళ్లి మళ్లీ ప్రాణాలతో తిరిగి రాగలిగిన జీవి ఒకే ఒక్కటి ఉంది. దీంతో ఈ విషయం కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఆ జీవి ఏదో కాదు ఫ్లోవర్ అనే పక్షి. ఈ పక్షి ఏకంగా మొసలికి దంత వైద్యుడిగా పనిచేస్తూ ఉంటుంది. ఆహారాన్ని తిన్న మొసలి దంతాల మధ్య ఇరుక్కున్న మాంసాన్ని.. ఇతర ఆహారాన్ని ఇది క్లీన్ చేస్తూ కడుపు నింపుకుంటూ ఉంటుంది.
ఇలా దంతాలను క్లీన్ చేసే క్రమంలో ఈ పక్షి మొసలి నోటి లోపలికి ప్రవేశిస్తుంది. ఇక లోపలి దంతాలను సైతం శుభ్రం చేస్తుంది. మళ్లీ హాయిగా ప్రాణాలతో బయటికి తిరిగి వస్తుంది ఈ పక్షి. అయితే ఒక్కసారి పంటికింద పడింది అంటే చాలు ఇక మొసలి ఏ జీవి ప్రాణం తీయడానికైనా సిద్ధపడుతూ ఉంటుంది. కానీ ఇక అటు ఫ్లోవర్ పక్షికి అటు మొసలికి స్నేహం ఉంది అన్నట్లుగానే ప్రమాదకరమైన మొసలి వ్యవహరిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ పక్షి ఇక మొసలి నోట్లోకి వెళ్లినా కూడా.. ఇక ఆ పక్షికి ఎలాంటి హాని తలపెట్టదు అని చెప్పాలి. ఎందుకంటే తన దంతాలను క్లీన్ చేస్తుందని కృతజ్ఞతా భావంతో ఉంటుంది మొసలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి