వర్షాకాలంలో చాలామందికి ఊరికే పాదాలు,చేతులు దురద పెట్టడం వంటివి జరుగుతూ ఉంటాయి.వాటికి కారణం వర్షాకాలంలో అతి వేగంగా వ్యాపించే ఫంగస్ మరియు బ్యాక్టీరియా.వీటితో చేతులపై మనం పొట్టు పొట్టుగా రాలిపోవడం,కాళ్లలో బురద పండ్లు,గోర్లు దెబ్బ తినడం వంటివి జరుగుతాయి.మరీ కొంతమంది అయితే ఆ దురదలను గోకిగోకి విసిగి చెందుతూ ఉంటారు. వాటిని పోగొట్టుకోవడానికి ఎన్నో కెమికల్ ప్రొడక్ట్స్ వాడినా,అప్పటికప్పుడు ఫలితం దక్కిన,తర్వాత షరా మామూలే.అలా కాకుండా శాశ్వతంగా దురదలకు ఇంట్లో సహజంగా దొరికే కొన్ని రకాల పదార్థాలు చెక్ పెడతాయి. మరి అవేంటో మనము తెలుసుకుందామా..

1).కొబ్బరి నూనె..
పూర్వం రోజుల్లో ఎలాంటి చర్మ సమస్యలైనా వెంటనే కొబ్బరి నూనె రాసేవారు ఎందుకంటే ఇందులో యాంటీ ఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల ఎటువంటి దురదలను పుండ్లను అయినా చిటికలోఉపశమనం కలిగిస్తాయి కనుక.కావున ఇలా మొదలతో బాధపడేవారు ఆ పుండ్లపై గోరువెచ్చని కొబ్బరి నూనెను రాయడం వల్ల తొందరగా తగ్గుముఖం పడతాయి.

2).కలబంద గుజ్జు..
అతి దురదలపై కలబంద గుజ్జు రాయడం వల్ల కూడా చర్మ సమస్యలను తొలగించుకోవచ్చు.ఇంకా చెప్పాలి అంటే కాలిన గాయాలను మానడంలో కూడా కలబంద గుజ్జు చాలా బాగా ఉపయోగపడుతుంది.ఎందుకంటే ఇందులో యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.

3).వోట్ మిల్ బాత్..
అతి దురదలతో బాధపడేవారు ఓట్స్ ని నానబెట్టి ఆ వాటర్ తో స్నానం చేయడం వల్ల,చర్మానికి హైడ్రేషన్ కలిగించి,దురదలు తగ్గుముఖం పట్టేందుకు సహాయపడుతుంది.

4).ఆపిల్ సిడర్ వెనిగర్..
ఎవరైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ,బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ వచ్చిన వారు ఒక కాటన్ బాల్ తీసుకొని,ఆపిల్ సైడర్ వెనిగర్ ని అద్దుకొని ఆ ఇన్ఫెక్షన్లపై రాయడం వల్ల, ఇందులోని అసిటిక్ యాసిడ్ బ్యాక్టీరియా మరియు ఫంగస్ ను చంపేస్తుంది.దీనితో దురదలు తొందరగా తగ్గుముఖం పడతాయి.

5).సోడా ఉప్పు..
వంటల్లో వాడే సోడా ఉప్పు కూడా దురదలు తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.చిటికెడు సోడా ఉప్పును తీసుకొని వాటిపై చల్లడం వల్ల కూడా దురదలు తొందరగా తగ్గుతాయి.

మీరు ఎవరైనా ఈ సమస్యతో బాధపడుతున్నట్టయితే, ఈ నివారణలు తప్పక పాటించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: